తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌(BRS) అధినేత కె.చంద్రశేఖర్‌రావు(KCR) ఇవాళ ఉమ్మడి మెదక్‌(Medak) జిల్లాలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో(Public meeting) ప్రసంగించనున్నారు. సుల్తాన్‌పూర్‌లో(Sulthanpur) నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభకు(Praja Ashirvada Sabha) లక్షమందికిపైగా ప్రజలు హాజరవుతారని బీఆర్‌ఎస్‌ నేతలు అంచనా వేస్తున్నారు.

మెదక్‌, జహీరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని ఆరు అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి జనసమీకరణపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. లోక్‌సభ ఎన్నికలకు(Lok sabha Election) సమయం దగ్గరపడింది. ఈ క్రమంలో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు కేసీఆర్‌ ఉమ్మడి మెదక్‌కు వెళుతున్నారు. కేసీఆర్‌కు ఘన స్వాగతం పలుకడానికి పార్టీ క్యాడర్‌ సిద్ధంగా ఉంది. సభలో హరీశ్‌రావుతోపాటు మెదక్‌, జహీరాబాద్‌ ఎంపీ అభ్యర్థులు వెంకట్రామిరెడ్డి, గాలి అనిల్‌కుమార్‌, పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర నాయకులు పాల్గొననున్నారు.

Updated On 16 April 2024 12:28 AM GMT
Ehatv

Ehatv

Next Story