తెలంగాణ సీఎం కేసీఆర్(Telangana CM KCR) సలహాదారుగా రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్(Somesh Kumar) నియమితులయ్యారు. ఇందుకు సంబంధించి మంగళవారం తెలంగాణ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి(Shanti Kumari).. మాజీ సీఎస్ నూతన నియామక ఉత్తర్వులు జారీ చేయడం విశేషం.

Somesh Kumar
తెలంగాణ సీఎం కేసీఆర్(Telangana CM KCR) సలహాదారుగా రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్(Somesh Kumar) నియమితులయ్యారు. ఇందుకు సంబంధించి మంగళవారం తెలంగాణ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి(Shanti Kumari).. మాజీ సీఎస్ నూతన నియామక ఉత్తర్వులు జారీ చేయడం విశేషం. ఇక ఈ పదవిలో సోమేష్ కుమార్ మూడేళ్లు కొనసాగనున్నట్టుగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆయనకు కేబినెట్ హోదా కల్పించారు. ఆయన నియమానికి సంబంధించిన టర్మ్స్ అండ్ కండీషన్స్ విడిగా జారీ చేయబడతాయని ఉత్తర్వులు తెలిపారు.
