తెలంగాణ(Telangana) విద్యుత్ ఉద్యోగులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) చేసిన అనుచిత వ్యాఖ్యలను ఎక్స్(ట్విటర్) వేదికగా ఖండించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు(Harish Rao). కరెంట్ కోతల విషయంలో సిఎం రేవంత్ రెడ్డి తన ప్రభుత్వ వైఫల్యాలను అంగీకరించకుండా ప్రతి పక్షాలు, విద్యుత్ ఉద్యోగుల మీద అభాండాలు మోపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని ఆయన అననారు.

తెలంగాణ(Telangana) విద్యుత్ ఉద్యోగులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) చేసిన అనుచిత వ్యాఖ్యలను ఎక్స్(ట్విటర్) వేదికగా ఖండించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు(Harish Rao). కరెంట్ కోతల విషయంలో సిఎం రేవంత్ రెడ్డి తన ప్రభుత్వ వైఫల్యాలను అంగీకరించకుండా ప్రతి పక్షాలు, విద్యుత్ ఉద్యోగుల మీద అభాండాలు మోపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని ఆయన అననారు. విద్యుత్ రంగ వైఫల్యాలకు నేనే భాద్యుడిని అన్నట్టుగా మాట్లాడటం విడ్డూరంగా ఉందని.. ఆయన వైఖరి ఆడ రాక పాత గజ్జెలు అనే సామెతను గుర్తు చేస్తున్నదని హరీష్‌రావు అన్నారు. బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం, 24 గంటల పాటు నిరంతరంగా విద్యుత్ సరఫరా చేసేందుకు.. విద్యుత్ ఉద్యోగుల సహకారంతో పటిష్ఠమైన వ్యవస్థను నిర్మించిందని.. రెప్పపాటు కాలం కూడా కరెంట్ కోతలు లేని ఏకైక రాష్ట్రంగా తెలంగాణను నిలిపిందన్నారు. కేవలం 5 నెలల్లోనే కాంగ్రెస్(congress) ప్రభుత్వం ఆ వ్యవస్థను కుప్ప కూల్చింది. గృహ, వ్యవసాయ, పారిశ్రామిక అవసరాలకు సరిపోయే విద్యుత్ సరఫరా చేయడంలో పూర్తిగా విఫలమైందని హరీష్‌రావు విమర్శించారు. తమ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకునేందుకు, ప్రతిపక్షాలు, విద్యుత్ ఉద్యోగులపై రేవంత్‌రెడ్డి నిరాధార ఆరోపణ చేస్తున్నారన్నారు. తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ పునర్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన విద్యుత్ ఉద్యోగులను చీటికి మాటికి నిందించడం, చర్యలు తీసుకోవడం వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడమేనని, విద్యుత్ ఉద్యోగుల పై నెపం నెట్టడమే తప్ప కరెంటు కోతలను ఎలా సరిదిద్దాలనే చిత్తశుద్ధి ముఖ్యమంత్రికి లేకపోవడం దురదృష్టకరమన్నారు. సీఎం ఇలాంటి చిల్లర మల్లర చేష్టలు మాని కేసీఆర్ హయాంలో రెప్ప పాటు కూడా పోని విధంగా 24 గంటల విద్యుత్‌ను ఇచ్చినట్టుగా అన్ని రంగాలకు సరఫరా చేస్తే మంచిదని సూచించారు. సీఎం రేవంత్‌రెడ్డి లాగే అందరూ కుట్రలు కుతంత్రాలకు పాల్పడుతారని ఆయన భ్రమల్లో ఉన్నట్టున్నారు. పాలనపై దృష్టి పెట్టాలని సూచించారు

Updated On 15 May 2024 4:07 AM GMT
Ehatv

Ehatv

Next Story