ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి మళ్లీ యాక్టి్వ్ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది . బీజేపీలో చేరడం దాదాపు ఖాయమైందంటూ ఇప్పటికే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి మళ్లీ యాక్టి్వ్ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది . బీజేపీలో చేరడం దాదాపు ఖాయమైందంటూ ఇప్పటికే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి త్వరలోనే కిరణ్ కుమార్ రెడ్డి కాషాయ కండువా కప్పుకోవడం ఖాయమంటూ ప్రచారం జరుగుతోంది. . 2014లో ఏపీ విభజనను వ్యతిరేకిస్తూ... కాంగ్రెస్‌కి గుడ్ బై చెప్పిన... కిరణ్ కుమార్ రెడ్డి.. ఆ తర్వాత సమైక్య ఆంధ్ర పార్టీ పెట్టారు. కానీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయారు. తర్వాత మళ్లీ కాంగ్రెస్‌లో చేరినా... యాక్టివ్‌గా లేరు .
అయితే ఏపీలో కాంగ్రెస్ పుంజుకునే అవకాశాలు లేకపపోవడంతో బీజేపీ నేతల ఆహ్వానంతో ఆ పార్టీలో చేరేందుకు కిరణ్ కుమార్ రెడ్డి సిద్దమయ్యారు. హైదరాబాద్ కేంద్రంగా బీజేపీలో ఆయన కీలక పాత్ర పోషించనున్నారని చెబుతున్నారు. జాతీయ స్థాయిలో కీలక పదవి ఇస్తామని కాషాయదళం హామీ ఇచ్చిందని, అందులో భాగంగానే బీజేపీ గూటికి వెళుతున్నారని తెలుస్తోంది. రెండు రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనుండగా.. ఆ తర్వాత ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో భేటీ కానున్నారు. అనంతరం మంచి ముహూర్తం చూసుకుని కాషాయ తీర్ధం పుచ్చుకోనున్నారు. గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి కిరణ్ కుమార్ రెడ్డి దూరంగా ఉంటున్నారు. ఆ పార్టీకి అంటీముట్టనట్లుగా ఉంటున్న ఆయన.. ఎక్కడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు.
తెలంగాణలో బీజేపీ బలోపేతం కోసమే కిరణ్ కుమార్ రెడ్డి పనిచేస్తారని చెబుతున్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా పనిచేయడంతో తెలంగాణలోని చాలామంది నేతలతో ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి. అలాగే తెలంగాణ రాజకీయాలపై కూడా ఆయనకు మంచి అవగాహన ఉంది. ఆ పరిచయాలతోనే టీ బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తారనే చర్చ జరుగుతోంది. గత కొంతకాలంగా హైదరాబాద్‌లోనే ఎక్కువగా కిరణ్ కుమార్ రెడ్డి ఉంటున్నారు. దీంతో ఇక నుంచి ఏపీ రాజకీయాలతో సంబంధం లేకుండా తెలంగాణ రాజకీయాల్లోనే ఆయన పాత్ర ఉంటుందని అంటున్నారు. డిసెంబర్‌లో తెలంగాణ ఎన్నికలు జరగనుండగా.. ఈ క్రమంలో కిరణ్ కుమార్ రెడ్డి ఎంట్రీ బీజేపీగా ఎలా కలిసొస్తుందనేది ఆసక్తికరంగా మారింది.