భువనగిరి జిల్లా భూదాన్‌ పోచంపల్లి (Pochampally) మండలంలో విషాదం చోటుచేసుకుంది.

భువనగిరి జిల్లా భూదాన్‌ పోచంపల్లి (Pochampally) మండలంలో విషాదం చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజామున పోచంపల్లి మండలంలోని జలాల్‌పూర్‌ చెరువులోకి ఓ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో అయిదుగురు యువకులు జలసమాధి అయ్యారు. ఒకరు సురక్షితంగా బయటపడ్డాడు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికి తీశారు. మృతులను వంశీగౌడ్‌(Vamshi Goud), దినేశ్(Dinesh), హర్ష(Harsha), బాలు(Balu), వినయ్‌గౌడ్‌(Vinay Goud)గా గుర్తించారు. వారంతా 22 నుంచి 25 ఏండ్ల మధ్య వయస్కులే! ప్రమాద సమయంలో కారులో ఆరుగురు ఉన్నారు. మణికంఠ(Manikanta) అనే యువకుడు క్షేమంగా ఉన్నాడు.వారంతా హైదరాబాద్‌ హయత్‌నగర్‌ ఆర్టీసీ కాలనీకి చెందినవారు. ఎల్బీనగర్‌(LB Nagar) నుంచి పోచంపల్లి వెళుతున్నప్పుడు జలాల్‌పూర్‌(Jalal pur) దగ్గర ప్రమాదకరంగా ఉన్న మూలమలుపు దగ్గర కారు అదుపుతప్పింది. కారు చెరువులోకి దూసుకెళ్లింది. మృతదేహాలను భువనగిరి ఆసుపత్రికి తరలించారు. వంశి డ్రైవింగ్‌ చేస్తున్నాడని, ఉదయం 4.30 గంటలకు ప్రమాదం జరిగిందని మణికంఠ తెలిపాడు. ప్రమాద సమయంలో కారు వేగంగా ఉందని, కారు రెండు పల్టీలు కొట్టి చెరువులో పడిందని చెప్పాడు.కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ehatv

ehatv

Next Story