కరీంనగర్ జిల్లా(Karimnagar) జమ్మికుంట(Jammikunta) మండలం బిజిగిర్‌షరేఫ్ గ్రామంలో చల్ల శివసాగర్ (26) ఏడెకరాల భూమిని కౌలుకు తీసుకుని పత్తి సాగు చేస్తున్నారు.
కరీంనగర్ జిల్లా(Karimnagar) జమ్మికుంట(Jammikunta) మండలం బిజిగిర్‌షరేఫ్ గ్రామంలో చల్ల శివసాగర్ (26) ఏడెకరాల భూమిని కౌలుకు తీసుకుని పత్తి సాగు చేస్తున్నారు. దీనికోసం రూ.5 లక్షల అప్పు చేశాడు. పంట దిగుబడి రాక, చేసిన అప్పు ఎలా తీర్చాలో తెలియక ఆదివారం శివసాగర్ ఇంట్లో ఉరేసుకున్నారు(Suicide).
నల్గొండ(Nalgonda) జిల్లా కేతేపల్లి మండలంలోని తుంగతుర్తికి చెందిన రైతు ఉప్పుల మల్లయ్య (45) మూడెకరాల భూమి ఉన్న ఈ రైతు తన కూతురు పెళ్లి సమయంలో, వ్యవసాయ అవసరాల కోసం అప్పులు చేశారు. వాటిని తీర్చేందుకు తనకున్న భూమిలో రెండెకరాలు విక్రయించారు. అయినా ఇంకా రూ.9 లక్షల అప్పు ఉండటంతో, తీర్చే మార్గం లేక మల్లయ్య ఆదివారం పురుగుల మందు తాగి.. చికిత్స పొందుతూ మల్లయ్య మృతి చెందాడు.
వికారాబాద్ జిల్లాలో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. యాలాల పోలీస్ స్టేషన్ పరిధిలో నాగసమందర్ కు చెందిన మాసుల యాదప్ప (42), భార్య మాసుల జ్యోతి (38) వ్యవసాయ పనులు చేస్తున్నారు. రెండేళ్ల క్రితం అప్పులు చేసి కూతురు వివాహం చేశారు. వ్యవసాయం కోసం కూడా మరి కొంత అప్పులు చేశారు. అప్పులబాధ, ఆర్థిక భారాలు మోయలేక మనోవేదనకు గురై ఆదివారం ఉదయం పురుగులమందు తాగి ఆత్మహత్యకు చేసుకున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం కంచనపల్లి గ్రామానికి చెందిన చంది శేఖులు(49) వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. రెండేళ్ల కిందట కొడుకు పెళ్లి చేయగా రూ.4 లక్షల వరకు అప్పు మిగిలింది. రెండు నెలల కిందట మళ్లీ రూ. లక్ష అప్పు తెచ్చి పొలంలో బోరు వేయగా నీళ్లు పడలేదు. పంట దిగుబడి రాక.. అప్పులు పెరిగి తీర్చేమార్గం లేకపోవడంతో తీవ్ర మనస్తాపం చెంది పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందాడు. రుణమాఫీ, రైతుబంధు సకాలంలో అంది ఉంటే ఈ ఆత్మహత్యలు జరగకపోయేవని.. ఇప్పటికైనా ప్రభుత్వం రుణమాఫీ జరగని రైతులకు మాఫీ చేసి, రైతుభరోసాపై తక్షణమే ఓ నిర్ణయం తీసుకోవాలని రైతు సంఘాలు కోరుతున్నాయి.