జూన్ 8న హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. చేప ప్రసాదం పంపిణీకి పేరొందిన బత్తిన కుటుంబం త్వరలో జరగబోయే కార్యక్రమానికి సంబంధించి కీలక ప్రకటన చేసింది.

సంప్రదాయం ప్రకారం.. మృగశిర కార్తీక రోజున చేప ప్రసాదం పంపిణీ చేసేందుకు నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. జూన్ 8 నుండి ప్రసాదం పంపిణీ చేయబడుతుందని బత్తిన కుటుంబం తెలిపింది. ఈ ప్రసాదంలో ఆస్తమాను తగ్గించడంలో సహాయపడే ఔషధ గుణాలు ఉన్నాయని నమ్ముతారు. అందుకే వేలాది మంది ప్రజలు చేప ప్రసాదం పంపిణీకై ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.
బత్తిన కుటుంబం హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అవసరమైన అన్ని ప్రభుత్వ అనుమతులతో చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తుంది. ప్రసాదం తయారీ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ ఏడాది జూన్ 8న మృగశిర కార్తె వస్తున్నదని.. ఆ రోజు చేప ప్రసాదం పంపిణీ జరుగుతుందని బత్తిన అనురీత్ గౌడ్, గౌరీశంకర్ గౌడ్ ప్రకటించారు. చేప ప్రసాద వితరణకు వేలాది మంది తరలివచ్చే అవకాశం ఉన్నందున భద్రతా ఏర్పాట్లను పోలీసులు పకడ్బందీగా పర్యవేక్షించనున్నారు.