శ్రీశైలం రిజర్వాయర్‌లో(Srisailam Reservoir) చేపలు(Fish) పెద్ద మొత్తంలో మృత్యువాత పడటం కలకలంరేపుతోంది. శ్రీశైలం డ్యామ్(Dam) ముందు భాగంలోని పెద్ద బ్రిడ్జ్ పక్కన గేజింగ్ మడుగులో కుప్పలు తెప్పలుగా భారీగా చేపలు మృతి చెందాయి.

Srisailam Reservoir
శ్రీశైలం రిజర్వాయర్‌లో(Srisailam Reservoir) చేపలు(Fish) పెద్ద మొత్తంలో మృత్యువాత పడటం కలకలంరేపుతోంది. శ్రీశైలం డ్యామ్(Dam) ముందు భాగంలోని పెద్ద బ్రిడ్జ్ పక్కన గేజింగ్ మడుగులో కుప్పలు తెప్పలుగా భారీగా చేపలు మృతి చెందాయి. చేపలు పెద్ద మొత్తంలో చనిపోవడానికి కారణం.. నీరు కలుషితమైందా()? లేక..కెమికల్స్ ఏమైనా కలిశాయా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. శ్రీశైలం రిజర్వాయర్‌లోని ముందు బాగంలో వాటర్ రంగు మారింది. లింగాలగట్టు సమీపంలోని రిజర్వాయర్‌లో చేపలు చనిపోవడంతో మత్స్యకారులు, స్దానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. గత ఐదు రోజులుగా చేపలు చనిపోతున్నాయని లింగాలగట్టు గ్రామస్థులు చెబుతున్నారు. శ్రీశైలం రిజర్వాయర్‌లో మత్స్య సంపదకు భారీగా నష్టం వాటిల్లడంతో మత్స్యకారులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని మత్స్యకారులు విజ్ణప్తి చేస్తున్నారు. చేపల మృతికి అసలు కారణాలు తెలియాల్సి ఉంది.
