తెలంగాణ అమరనాథ్‌ యాత్రగా పేరుగాంచిన సలేశ్వరం లింగమయ్య ఉత్సవాలు ఇవాళ్టి నుంచి మొదలయ్యాయి. గతంతో పోలిస్తే మొదటిరోజున భక్తుల తాకిడి పెద్దగా కనిపించలేదు. మండుతున్న ఎండల్లో ప్రయాణం కష్టమవుతోంది. అటవీశాఖ రాత్రి వేళ భక్తులను అమనించకపోవడంతో గత్యంతరం లేక పగటిపూటే యాత్ర చేయాల్సి వస్తున్నది

తెలంగాణ అమరనాథ్‌ యాత్రగా(Telangan Amarnath Yatra) పేరుగాంచిన సలేశ్వరం లింగమయ్య ఉత్సవాలు ఇవాళ్టి నుంచి మొదలయ్యాయి. గతంతో పోలిస్తే మొదటిరోజున భక్తుల తాకిడి పెద్దగా కనిపించలేదు. మండుతున్న ఎండల్లో ప్రయాణం కష్టమవుతోంది. అటవీశాఖ రాత్రి వేళ భక్తులను అమనించకపోవడంతో గత్యంతరం లేక పగటిపూటే యాత్ర చేయాల్సి వస్తున్నది. అదీ కాకుండా అయిదు రోజుల జాతరను అటవీశాఖ మూడు రోజులకు కుదించింది. రాత్రిపూట భక్తులను అనుమతించకపోవడంతో సలేశ్వరం లింగమయ్యను దర్శించుకోవడానికి పగటిపూటనే భక్తులు బారులు తీరారు. చెంచు పూజారులు గిరిజన సంప్రదాయబద్దంగా స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. సలేశ్వర యాత్ర చేస్తున్న భక్తుల ఆకలిదప్పులు తీర్చడానికి స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకొచ్చారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి సమయాలలో భోజనాలు, రాగి అంబలి, మజ్జిగ, తాగునీటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖ ఆధ్వర్యంలో తాగునీటి ఏర్పాట్లు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్రల నుంచి కూడా భక్తులు అధికసంఖ్యలో వచ్చారు. మరోవైపు సలేశ్వరం జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నది. పుల్లాయిపల్లి పెంట వరకు బస్సులు నడుస్తున్నాయి. అక్కడ్నుంచి ఆటోలో వెళ్లాల్సి ఉంటుంది.

Updated On 23 April 2024 2:05 AM GMT
Ehatv

Ehatv

Next Story