జయశంకర్‌ భూపాలపల్లి(Jaya shankar bhupalapally) జిల్లా మహదేవపూర్‌ మండలం అంబట్‌పల్లిలో దిగ్భ్రాంతి కలిగించే ఘటన చోటు చేసుకుంది.

జయశంకర్‌ భూపాలపల్లి(Jaya shankar bhupalapally) జిల్లా మహదేవపూర్‌ మండలం అంబట్‌పల్లిలో దిగ్భ్రాంతి కలిగించే ఘటన చోటు చేసుకుంది. గ్రామంలో ఉన్న హనుమంతుడి విగ్రహానికి(Hanuman Idol) మంటలు() చెలరేగాయి. పురాతనమైన శ్రీ అమరేశ్వర స్వామి ఆలయంలో(Sri Amareshwara Swamy Temple) గురువారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఆలయ ఆవరణలో ఉన్న హనుమాన్‌ విగ్రహానికి మంటలు వ్యాపించాయి. ఈ ఘటన చూసిన స్థానికులు భయాందోళన చెందుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆలయాన్ని పరిశీలించారు. మంటల్లో కాలిపోయిన హనుమాన్‌ విగ్రహంపై ప్లాస్టిక్‌ ఉన్నట్టు గుర్తించానని ఆలయ అర్చకుఉడు నాగేశ్వర శర్మ అంటున్నారు. విగ్రహం తగలబడటం ఆలయానికి, ఊరికి అరిష్టమని స్థానికులు అనుకుంటున్నారు. ఇది ప్రమాదవశాత్తూ జరిగిన ఘటననా? లేక ఎవరైనా దుండుగులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Eha Tv

Eha Tv

Next Story