మనిషి జన్మ ఎత్తినందుకు కాసింత సభ్యత సంస్కారం ఉండాలి. అవి లేని వాళ్లను పశువుల కిందనే ట్రీట్ చేస్తారు. ప్రణీత్ హనుమంతు అలాంటి కోవకే వస్తాడు.
మనిషి జన్మ ఎత్తినందుకు కాసింత సభ్యత సంస్కారం ఉండాలి. అవి లేని వాళ్లను పశువుల కిందనే ట్రీట్ చేస్తారు. ప్రణీత్ హనుమంతు అలాంటి కోవకే వస్తాడు. అతడు చేసింది మామూలు తప్పు కాదు. చేయకూడని తప్పిదమే చేశాడు. ఇప్పుడు క్షమాపణలు వేడుకుంటున్నాడు. క్షమాపణలు చెప్పినంత మాత్రాన ప్రణీత్ హనుమంత్‌ను(Praneeth Hanumanthu) ఊరికే వదిలేయకూడదని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. ఇతగాడు ఎవరంటే ఓ యూ ట్యూబర్(Youtuber). ఈ మధ్యన రోస్టర్లు అనే ఓ ట్రెండ్ తయారయ్యింది. సోషల్ మీడియా వేదికగా అనేక రకాల వీడియోలు వస్తుంటాయి కదా. వాటిల్లో రోస్టర్లు(Roaster) అంటే రోస్ట్ చేసేవాళ్లు అనే అర్థంలో కొందరు యూట్యూబర్లు ఉంటారు. వీరేం చేస్తారయ్యా అంటే సినిమా వీడియోలు, ప్రముఖులకు సంబంధించిన వీడియోలు, ట్రెండింగ్ అవుతున్న వీడియోలు, ఇతర వీడియోలో గురించి చర్చించుకుంటూ తమ అభిప్రాయాలను చెబుతారు. అది కూడా మామూలుగా కాదు, అసభ్య పదజాలంతో! ఇట్టాగే ప్రణీత్ హనుమంతు గ్యాంగ్ కూడా ఓ దారుణానికి ఓడిగట్టింది. పిల్లలపై లైంగిక చర్యలను(Sexual harrasment) ప్రోత్సహించేలా ఓ వీడియో చేశారు.. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత చూసి జడుసుకుని ఆ వీడియోను తొలగించారునుకోండి. అయినప్పటికీ జరగాల్సిందంతా జరిగింది. అయిదేళ్ల పాప, ఆమె తండ్రిగా కనిపిస్తున్న వ్యక్తి చేసిన ఓ రీల్‌పై యూ ట్యూబ్‌లో రివ్యూ చేసిన ఈ గ్యాంగ్ ఆ రీల్ తర్వాత ఏమి జరిగి ఉండవచ్చు అంటూ అసభ్యకరంగా మాట్లాడారు. అసభ్యం కాదు, జుగుస్పాకరం అనాలి. చట్టవ్యతిరేకమైన కామెంట్లు కూడా చేసి చచ్చారు. చాలా మంది ఈ వీడియోపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
అసలు అంత దారుణమైన భాషను ఎలా ఉపయోగించారు? తండ్రితో ఆడుకుంటున్న ఓ చిన్నారి వీడియోను చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది. కానీ ప్రణీత్ హనుమంతు, మరో ముగ్గురికి మాత్రం వికృతమైన ఆలోచనలు కలిగాయి. లైంగిక కోణంలో చూస్తూ దారుణమైన వ్యాఖ్యలు చేశారు. సభ్య సమాజం తలదించుకునేట్టుగా వ్యవహరించారు. ఈ దుష్ట చతుష్టయం చేసిన వీడియోను చూసిన హీరో సాయిధరమ్ తేజ్ ఈ విషయాన్నిఎక్స్ (ట్విట్టర్) ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. సోషల్ మీడియా ప్రపంచం నిర్దాక్షిణ్యంగా, ప్రమాదకరంగా మారిందని.. దాన్ని నియంత్రించడం కష్టం కాబట్టి తమ పిల్లల ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేసే తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని సాయి ధరమ్ తేజ సూచించారు. ఇలాంటి రాక్షసులపై కఠినచర్యలు తీసుకోవాలని కోరారు. హీరో మంచు మనోజ్ కూడా తన ఎక్స్ ఖాతాలో ప్రణీత్ హనుమంతుపై విరుచుకుపడ్డారు. రెండు రాష్ట్రాల సీఎంలు , డిప్యూటీ సీఎంలతో పాటుగా టెక్సాస్ అధికారులు, అమెరికా రాయబార కార్యాలయాన్ని ఆయన ట్యాగ్ చేస్తూ ప్రణీత్ హనుమంతుపై చర్య తీసుకోవాలని కోరారు. హాస్యం పేరిట సోషల్ మీడియాలో ద్వేషాన్ని కక్కుతున్న హనుమంతు ప్రవర్తన జుగుప్సాకరమైనదే కాదని, ప్రమాదకరం కూడా అని మనోజ్ ఆందోళన చెందాడు.
ఇంతకీ ఆ వీడియోలో ఏమున్నదంటే.. తండ్రీ కూతురు కలిసి ఓ రీల్ చేశారు. వారిద్దరూ నిజంగానే తండ్రీ కూతురు తెలియదు కానీ రీల్ చూస్తే మాత్రం తండ్రీ కూతురులాగే ఉన్నారు. ఆ రీల్‌పైన నాకు పిల్లలంటే ఇష్టం ఉండదు. కానీ నాకే కనుక కూతురు ఉంటే.. అనే శీర్షిక ఉంది. తండ్రి బెల్ట్ చేత్తో పట్టుకుని అమ్మాయివైపు కోపంగా వస్తాడు. ఆమె దగ్గరకు వచ్చి ఆ బెల్ట్‌ను ఉయ్యాలలాగా మార్చి తన రెండు చేతులతో పట్టుకుని, అందులో ఆ పాపను కూర్చోబెట్టుకుంటాడు. అక్కడితో ఆ రీల్ అయిపోతుంది. ఇది చూసినవారికెవరికైనా తండ్రీ కూతుళ్ల మధ్య ఉన్న గాఢమైన అనుబంధం తెలుస్తుంది. కానీ ప్రవీణ్ బృందానికి మాత్రం అలా కనిపించలేదు. ఆ వీడియోపై ఇష్టం వచ్చినట్టుగా కామెంట్లు చేశారు. తండ్రీ కూతుళ్ల మధ్య లైంగికసంబంధం ఉందనేటట్టుగా వీరు మాట్లాడారు. వీడియోపై లైవ్ డిస్కషన్ పెట్టిన ప్రవీణ్‌తో పాటు ఆది, బుర్రా అనేవారు అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తుంటే మిగతా వారు పడిపడి నవ్వుతారు.
ఈ దరిద్రపు వీడియోపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. ప్రణీత్‌ను కఠినంగా శిక్షించాలనే డిమాండ్ అందరినోటా వినిపిస్తున్నది. సాయి ధరమ్ తేజ(Sai dharam tej) చేసిన ట్వీట్‌కు తెలంగాణ సీఎం(Revanth reddy) రియాక్టయ్యారు. చిన్నారుల భద్రతకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, సదరు యూట్యూబర్‌పై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అన్నట్టుగానే ప్రణీత్ హనుమంతుతో పాటు మిగతావారిపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. నిందితులపై చట్టప్రకారం కఠినచర్యలు తీసుకుంటామని డీజీపీ రవిగుప్తా చెప్పారు.