తెలంగాణ కేడర్‌కు చెందిన ఐఏఎస్ సందీప్ కుమార్ ఝాపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా కోర్టు ఆదేశించింది. సందీప్ కుమార్ ఝా భార్య చేసిన ఫిర్యాదు మేరకు కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.

తెలంగాణ కేడర్‌(Telangana Cadre)కు చెందిన ఐఏఎస్ సందీప్ కుమార్ ఝా(Sandeep Kumar Jha)పై ఎఫ్‌ఐఆర్(FIR) నమోదు చేయాలని ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా కోర్టు(Korba Court) ఆదేశించింది. సందీప్ కుమార్ ఝా భార్య చేసిన ఫిర్యాదు మేరకు కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. సందీప్ కుమార్ ఝా వరకట్న వేధింపులు(Dowry Harassment), అసహజ చర్యలకు(Unnatural Acts) పాల్పడ్డాడని బాధిత మహిళ ఆరోపించింది. ఐఏఎస్‌ సందీప్ కుమార్ ఝా 2014 బ్యాచ్‌కు చెందిన‌ అధికారి.

కోర్బాలోని సివిల్ లైన్ పోలీస్ స్టేషన్(Civil Line Police Station) పరిధిలోని కొసబరి(Kosabari )లో నివసిస్తున్న బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. ఆమెకు 21 నవంబర్ 2021న బీహార్‌(Bihar)లోని దర్భంగా(Darbhanga) జిల్లా.. పోలీస్ స్టేషన్ లహేరియా సరాయ్ మొహల్లా బలభద్రపూర్‌(Police Station Laheria Sarai Mohalla Balbhadrapur)కు చెందిన ఐఏఎస్‌ సందీప్ కుమార్ ఝాతో వివాహం జరిగింది. పెళ్లికి కోటి 70 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. అయినా అత్తమామలు సంతోషించలేదు. దీంతో వరకట్నం విషయంలో గొడవ కూడా జరిగింది. అంతేకాకుండా.. తనను అసహజ శృంగారానికి బలవంతం చేశాడ‌ని బాధిత‌ మహిళ ఆరోపించింది. దీనిపై గతంలో పోలీస్ స్టేషన్‌లో, ఏస్పీకి ఫిర్యాదు చేసినా వినకపోవడంతో.. బాధితురాలు కోర్టును ఆశ్రయించి.. తన న్యాయవాది శివనారాయణ్ సోనీ(Shivnarayan Soni) ద్వారా కోర్బా కోర్టులో ఫిర్యాదు చేసింది. ఈ నేప‌థ్యంలో చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కృష్ణ కుమార్ సూర్యవంశీ(Chief Judicial Magistrate Krishna Kumar Suryavanshi).. సందీప్ కుమార్ ఝాపై ఎఫ్‌ఐఆర్ న‌మోదు చేయాలని ఆదేశించారు. ఈ మేర‌కు సివిల్ లైన్ రాంపూర్ పోలీస్ స్టేషన్‌కు ఆదేశాలు అందాయి.

Updated On 10 Jun 2023 11:08 PM GMT
Yagnik

Yagnik

Next Story