పెళ్లిళ్లల్లో చిన్నపాటి గొడవలు జరుగుతూనే ఉంటాయి. పెళ్లికూతురు వాళ్లు సరిగ్గా మర్యాద చేయలేదని పెళ్లికొడుకు తరపు బంధువులు అలగడం, గొడవపడటం మనం చూస్తూనే ఉన్నాం. కానీ విందులో అడిగినంత మటన్(Mutton Curry)వేయలేదనే కారణంగా పొట్టు పొట్టు కొట్టుకోవడం మాత్రం చాలా అరుదు. లేటెస్ట్‌గా జగిత్యాల(jagtial) జిల్లా మెట్‌పల్లి(Metpally) మండలం ఆత్మకూరు(Atmakur)లో ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది.

పెళ్లిళ్లల్లో చిన్నపాటి గొడవలు జరుగుతూనే ఉంటాయి. పెళ్లికూతురు వాళ్లు సరిగ్గా మర్యాద చేయలేదని పెళ్లికొడుకు తరపు బంధువులు అలగడం, గొడవపడటం మనం చూస్తూనే ఉన్నాం. కానీ విందులో అడిగినంత మటన్(Mutton Curry)వేయలేదనే కారణంగా పొట్టు పొట్టు కొట్టుకోవడం మాత్రం చాలా అరుదు. లేటెస్ట్‌గా జగిత్యాల(jagtial) జిల్లా మెట్‌పల్లి(Metpally) మండలం ఆత్మకూరు(Atmakur)లో ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. మెట్‌పల్లి మండలం ఆత్మకూరుకు చెందిన అమ్మాయికి, వేములవాడకు చెందిన అబ్బాయికి బుధవారం ఆత్మకూరులో పెళ్లయ్యింది. విందులో మటన్‌ సరిగ్గా వడ్డించలేదంటూ పెళ్లి కొడుకు తరఫు బంధువులు గొడవకు దిగారు. ఆ గొడవ పెద్దదయ్యింది. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు తరఫు బంధువులు తెగ కొట్టుకున్నారు. కొందరికి తీవ్ర గాయాలయ్యాయి కూడా! ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు కూడా చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated On 21 March 2024 1:08 AM GMT
Ehatv

Ehatv

Next Story