గుండెపోటుతో(Heart attack) మరణించిన తండ్రికి పెద్ద కూతురు తలకొరివి పెట్టింది. మిగిలిన నలుగురు కూతుళ్లు పాడే మోశారు. అంతిమ సంస్కారంలో(Last rites) అన్ని తామై కర్మకాండలు నిర్వహించారు కూతుళ్లు. ఈ విషాద సంఘటన కొత్తగూడెం జిల్లా మణుగూరు(Manuguru) మండలం రాజుపేటలో జరిగింది. అల్లారుముద్దుగా పెంచి, విద్యాబుద్ధులు నేర్పించిన కన్నతండ్రి(Father) అకాల మరణం ఆ అయిదుగురు కూతుళ్లను అమితంగా బాధిస్తున్నా..దుఃఖాన్ని పంటికింద అదిమిపెట్టుకుని తండ్రికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
గుండెపోటుతో(Heart attack) మరణించిన తండ్రికి పెద్ద కూతురు తలకొరివి పెట్టింది. మిగిలిన నలుగురు కూతుళ్లు పాడే మోశారు. అంతిమ సంస్కారంలో(Last rites) అన్ని తామై కర్మకాండలు నిర్వహించారు కూతుళ్లు. ఈ విషాద సంఘటన కొత్తగూడెం జిల్లా మణుగూరు(Manuguru) మండలం రాజుపేటలో జరిగింది. అల్లారుముద్దుగా పెంచి, విద్యాబుద్ధులు నేర్పించిన కన్నతండ్రి(Father) అకాల మరణం ఆ అయిదుగురు కూతుళ్లను అమితంగా బాధిస్తున్నా..దుఃఖాన్ని పంటికింద అదిమిపెట్టుకుని తండ్రికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కన్నతండ్రి రుణం ఆ విధంగా తీర్చుకున్నారు. మణుగూరు మండలం గాంధీ బొమ్మ సెంటర్‌లో నివాసం ఉంటున్న నరసింహారావు – గోపమ్మ దంపతులకు ఓ కుమారుడు, అయిదుగురు కూతుళ్లు. నరసింహరావు సింగరేణిలో(Singareni) పని చేసి రిటైరయ్యారు. ఉన్నంతలో పిల్లలందరిని ఉన్నత చదువులు చదివించారు. రెండేళ్ల కిందట ఈతకు వెళ్లిన కుమారుడు గోదావరిలో(Godavari) మునిగి చనిపోయాడు. అప్పట్నుంచి నరసింహరావును కంటికిరెప్పలా చూసుకున్నారు కూతుళ్లు. సోమవారం తెల్లవారుజామున నరసింహారావు గుండునొప్పితో విలవిలలాడుతుంటే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి వెంటనే తీసుకెళ్లారు కుటుంబసభ్యులు. చికిత్స చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలోనే నరసింహారావు గుండె ఆగిపోయింది. కొడుకులు లేని తమ తండ్రి అంత్యక్రియలను అయిదుగురు కూతుళ్లు నిర్వహించారు.