కామారెడ్డి(Kamareddy) జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పాము కాటుతో(Snake Bite) తండ్రి, కొడుకు మృతి చెందారు. రాజంపేట(Rajampeta mandalam) మండలం షేర్ శంకర్ తండా గ్రామపంచాయతీ పరిధిలోని మూడుమామిళ్ల తండాకు చెందిన రవి(Ravi)(36), వీక్కు(Vikku)(11) పాము కాటుతో మృతి చెందారు.

Father And Son Died To Snake Bite
కామారెడ్డి(Kamareddy) జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పాము కాటుతో(Snake Bite) తండ్రి, కొడుకు మృతి చెందారు. రాజంపేట(Rajampeta mandalam) మండలం షేర్ శంకర్ తండా గ్రామపంచాయతీ పరిధిలోని మూడుమామిళ్ల తండాకు చెందిన రవి(Ravi)(36), వినోద్ (vinodh)(11) పాము కాటుతో మృతి చెందారు. రాత్రి ఇంట్లో పడుకున్న సమయంలో కొడుకు శరీరం పైనుంచి వెళ్తున్న పామును చూసిన తండ్రి.. కొట్టేందుకు వెళ్లాడు. దీంతో పాము బుసలు కొడుతూ తండ్రీ, కొడుకులను కరిచింది. అది గమనించిన స్థానికులు వెంటనే తండ్రీకొడుకులను చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇరువురు మృతి చెందారు. ఇరువురు మృతితో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రాజంపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
