కూతురును అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేశారు తండ్రి. కూతురు ఏది అడిగితే అది తెచ్చి ఇచ్చేవారు. ప్రాణానికి ప్రాణంగా కూతురును ప్రేమించాడు. ఉన్నత విద్యలు చదివించాడు. ఇంతా చేస్తే ఆ తండ్రికి ఇష్టం లేని ప్రేమ పెళ్లి(Love Marriage) చేసుకుంది.
కూతురును అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేశారు తండ్రి. కూతురు ఏది అడిగితే అది తెచ్చి ఇచ్చేవారు. ప్రాణానికి ప్రాణంగా కూతురును ప్రేమించాడు. ఉన్నత విద్యలు చదివించాడు. ఇంతా చేస్తే ఆ తండ్రికి ఇష్టం లేని ప్రేమ పెళ్లి(Love Marriage) చేసుకుంది. ఇంట్లోంచి వెళ్లిపోయింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆ తండ్రి చేసిన పనే ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే రాజన్న సిరిసిల్ల(rajanna sircilla) జిల్లాలో చిలువేరి అనూష అనే అమ్మాయి ఓ అబ్బాయిని ప్రేమించింది. తల్లిదండ్రులకు చెప్పకుండా ఇంట్లోంచి వెళ్లిపోయి అతడిని పెళ్లి చేసుకుంది. తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందన్నందుకు ఆ తండ్రి తీవ్రంగా బాధపడ్డాడు. మనోవేదనకు గురయ్యారు. తన కూతురుకు శ్రద్ధాంజలి ఘటిస్తూ పోస్టర్లు వేశాడు. ఫ్లెక్సీలను అంతటా ఏర్పాటు చేయించాడు. సోషల్ మీడియాలో వాటిని పోస్టు చేసి బంధుమిత్రులందరికీ తన కూతురు చనిపోయిందని చెబుతూ పిండ ప్రదానాలు చేశాడు.