మహబూబ్‌నగర్‌లోని (MahaboobNagar) బాలానగర్ (Balanagar) చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బాలానగర్ చౌరస్తాలో సంత (Market) జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో చిన్నారి సహా ఆరుగురు మృతి చెందారు. స్పాట్‌లో ముగ్గురు మరణించగా. ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ముగ్గురు మృత్యువాత పడ్డారు. డీసీఎం డ్రైవర్ వేగంగా నడుపుతూ ఈ ప్రమాదానికి కారణమయ్యాడని స్థానికులు తెలిపారు
మహబూబ్‌నగర్‌లోని (MahaboobNagar) బాలానగర్ (Balanagar) చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బాలానగర్ చౌరస్తాలో సంత (Market) జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో చిన్నారి సహా ఆరుగురు మృతి చెందారు. స్పాట్‌లో ముగ్గురు మరణించగా. ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ముగ్గురు మృత్యువాత పడ్డారు. డీసీఎం డ్రైవర్ వేగంగా నడుపుతూ ఈ ప్రమాదానికి కారణమయ్యాడని స్థానికులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే..
బాలానగర్ చౌరస్తాలో శుక్రవారం సంత జరుగుతుంది. కూరగాయలు, ఇతర వస్తువులు కొనేందుకు ప్రజలు అక్కడికి వస్తారు. ఈ క్రమంలో రోడ్డు క్రాస్ చేస్తుండగా ఆటో, బైక్‌ను హైదరాబాద్ (Hyderabad) నుంచి వస్తున్న డీసీఎం (DCM) వేగంగా ఢీకొంది. ప్రమాదంలో మొత్తం ఆరుగురు చనిపోయారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. మౌనిక అనే మహిళను జిల్లా ఆస్పత్రికి తరలించారు. గాయపడి పరిస్థితి విషమంగా ఉండడంతో మరో వ్యక్తి భద్రసింగ్‌ను హైదరాబాద్ తరలించారు. డీసీఎం డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమంటూ స్థానికులు ఆగ్రహం చెందారు. డీసీఎంను తగలబెట్టారు. సంత రోజు ట్రాఫిక్ నిర్వహణ సరిగాలేకనే ఈ ప్రమాదం జరిగిందని జడ్చర్ల రూరల్ సీఐ (Jadcharla Rural CI), బాలానగర్ ఎస్సైని (Balanagar SI) స్థానికులు బంధించారు. దీంతో కొద్ది సేపు ఉద్రిక్తత నెలకొంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.