కరీంనగర్(Karimnagar) జిల్లా వీణవంక మండలం వల్బాపూర్ గ్రామానికి చెందిన పోతరాజు పోచాలు (45) తన మూడెకరాల భూమిలో వరి, పత్తి సాగు(Farming) చేశారు. నీరు లేక తడి సరిగ్గా అందక దిగుబడి రాక నష్టపోయాడు.

కరీంనగర్(Karimnagar) జిల్లా వీణవంక మండలం వల్బాపూర్ గ్రామానికి చెందిన పోతరాజు పోచాలు (45) తన మూడెకరాల భూమిలో వరి, పత్తి సాగు(Farming) చేశారు. నీరు లేక తడి సరిగ్గా అందక దిగుబడి రాక నష్టపోయాడు. పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు(Debt) పెరిగిపోవడంతో ఆందోళన చెందిన పోచాలు పురుగు మందు తాగడు. ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ నిన్న మృతి చెందాడు. దీంతో ఆయన కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఇక మరో రైతు జోగులాంబ గద్వాల జిల్లా(Gadwal) మల్దకల్ మండలం మల్లెందొడ్డి గ్రామానికి చెందిన నాగేశ(40) కుటుంబపోషణ, పొలం పెట్టుబడుల నిమిత్తం అప్పులు చేసి ఆయన తనకున్న రెండె కరాల్లో మిరప పంట వేయగా గిట్టుబాటు ధర లేక నష్టాలు వచ్చాయి. దీంతో మనస్తాపానికి గురైన నాగేశ పొలంలోనే పురుగుమందు తాగాడు. కుటుంబసభ్యులు వెంటనే గద్వాల ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందాడు. తెలంగాణలో రోజురోజుకు రైతుల ఆత్మహత్యలు ఎక్కువ అవుతున్నాయని.. రైతులను వెంటనే ఆదుకోవాలని రైతుసంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి

Updated On 8 May 2024 3:37 AM GMT
Ehatv

Ehatv

Next Story