వివాదాస్పద జ్యోతిష్కుడు వేణస్వామి(Venu swamy) గత కొన్ని రోజులుగా మీడియాలో నలుగుతున్నారు.

వివాదాస్పద జ్యోతిష్కుడు వేణస్వామి(Venu swamy) గత కొన్ని రోజులుగా మీడియాలో నలుగుతున్నారు. ఎప్పుడైతే నాగార్జున(Nagarjuna akkineni) కుమారుడు నాగచైతన్య(Naha chaithanya)- శోభిత(shobhita) ఎంగేజ్‌మెంట్‌పై వేణుస్వామి వ్యాఖ్యలు చేశారో అప్పట్నుంచి ఆయనపై విమర్శలు మొదలయ్యాయి. మరీ ముఖ్యంగా ఓ మీడియా సంస్థ వేణుస్వామిని టార్గెట్‌ చేసింది. వేణుస్వామిపై తెలుగు సినిమా జర్నలిస్టులు తెలంగాణ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. పోలీస్‌స్టేషన్‌లలో కంప్లయింట్లు కూడా వచ్చాయి. దీని వెనుక నాగార్జున ఉన్నారన్నది వేణుస్వామి భావన! అందుకే ఈ రోజు నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ను(N-Convention) కూల్చివేస్తుంటే ఆ దృశ్యాలను వేణుస్వామి తన స్టేటస్‌లో పెట్టుకున్నారు. పరోక్షంగా తనతో పెట్టుకుంటే ఏమవుతుందో చూశారా అంటున్నట్టుగా ఉంది.

Eha Tv

Eha Tv

Next Story