హైదరాబాద్ అసెంబ్లీ(Hyderabad assembly) ఎదురుగా ఉన్న గన్ పార్క్(Gan Park) ముందు తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ముందుగా అమరవీరుల స్థూపనికి పులమాల వేసి నివాళ్ళు అర్పించిన కుటుంబసభ్యులు..
హైదరాబాద్ అసెంబ్లీ(Hyderabad assembly) ఎదురుగా ఉన్న గన్ పార్క్(Gan Park) ముందు తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ముందుగా అమరవీరుల స్థూపనికి పులమాల వేసి నివాళ్ళు అర్పించిన కుటుంబసభ్యులు.. రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న స్మృతి వనంలో అమరవీరులను విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. 12 వందల మంది అమరుల చరిత్రను, వారి ఫోటోలను స్మృతి వనంలో పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
స్మృతి వనాన్ని అమరుల కుటుంబ సభ్యులతో ప్రారంభింపజేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అమరుల త్యాగాలను గుర్తించడం లేదన్నారు. గత పదేళ్లుగా ముఖ్యమంత్రిను కలవడానికి ప్రగతి భవన్ వెళ్తున్నా.. గేట్ లోపలికి కూడా వెళ్ళనీయడం లేదని అన్నారు. అమరుల కుటుంబాల కోసం ఇచ్చిన జీవో 80ను రద్దు చేయడం వల్ల పెన్షన్ కూడా అందడం లేదని.. జీవో 80ను పునరుద్ధరించి.. జూన్ 2న స్మృతి వనం ప్రారంభానికి అమరవీరుల కుటుంబాలను ఆహ్వానించాలని డిమాండ్ చేశారు.