మేడారం జాతరకు(Medaram jathara) ఇంకా వారం రోజుల సమయం ఉంది. కానీ ఇప్పటికే మేడారం పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. అమ్మవారికి నిలువెత్తు బంగారం సమర్పిస్తున్నారు.
మేడారం జాతరకు(Medaram jathara) ఇంకా వారం రోజుల సమయం ఉంది. కానీ ఇప్పటికే మేడారం పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. అమ్మవారికి నిలువెత్తు బంగారం సమర్పిస్తున్నారు. సాధారణంగా భక్తులు తమ బరువును తూకం వేసి అందుకు తగినంత బంగారాన్ని అమ్మవారికి సమర్పించుకుంటుంటారు. అయితే ఈసారి జాతరలో ఓ వింత ఘటన జరిగింది. ఓ కుటుంబం తమ ఇంట్లో పెంచుకునే కుక్క(Dog) ఆరోగ్యం బాగుండాలని అమ్మవారికి మొక్కుకుంది. కుక్క ఆరోగ్యం బాగుంటే దాని ఎత్తు బంగారం అమ్మవారికి సమర్పించుకుంటామని మొక్కుకున్నారు.
హన్మకొండకు(Hanumakonda) చెందిన భిక్షపతి కుటుంబం ఓ కుక్కను ప్రేమగా పెంచుకుంటోంది. దానికి లియ(Liya) అనే పేరు పెట్టింది. గత జాతర సందర్భంగా లియ
అనారోగ్యానికి గురైంది. దీంతో ఆహారం ముట్టకుండా అస్వస్థతకు గురైంది. ఆ సమయంలో సమ్మక్క-సారళమ్మ దేవతలకు తమ కుక్క ఆరోగ్యం బాగు చేయాలని మొక్కుకున్నారు. లియ ఆరోగ్యం బాగుపెడితే ఈ జాతరకు దాని ఎత్తు బంగారం సమర్పిస్తామని ప్రార్థించారు. ఆ తర్వాత లియ ఆరోగ్యం బాగుపడడం, సాధారణ స్థితికి వచ్చి కుక్క యాక్టివ్ కావడంతో భిక్షపతి కుటుంబం సంతోషపడింది. దీంతో అమ్మవార్లు తమ మొక్కును ఆలకించి కుక్క ఆరోగ్యాన్ని బాగు చేశారని వన దేవతలకు మొక్కు చెల్లించుకున్నారు.