తమ కుటుంబంలో గొడవలు లేవని, మీడియా తప్పుడు కథనాలు రాయకూడదని చెప్పి రోజు కూడా గడవలేదు ఫ్యామిలీ వివాదం పోలీసు స్టేషన్ వరకు వెళ్ళింది.
తమ కుటుంబంలో గొడవలు లేవని, మీడియా తప్పుడు కథనాలు రాయకూడదని చెప్పి రోజు కూడా గడవలేదు ఫ్యామిలీ వివాదం పోలీసు స్టేషన్ వరకు వెళ్ళింది. టాలీవుడ్ సినిమాను తలపిస్తున్నది. ఇప్పటికే మోహన్‌బాబు, ఆయన్ రెండో కుమారుడు మంచు మనోజ్ (Manchu Manoj) మధ్య వాగ్వాదం చోటుచేసుకున్న విషయం అందరికి తెలిసిపోయింది. దాచిపెట్టలనుకున్నా దాగలేదు .మంచు మనోజ్ కాళ్లకు గాయాలవడంతో బంజారాహిల్స్‌లోని టీఎక్స్ ఆస్పత్రిలో చేరాడు. లేటెస్ట్ గా ఈ వ్యవహారంలో మంచు మనోజ్‌పై మోహన్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.మనోజ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని చెబుతూ రాచకొండ సీపీకి మోహన్ బాబు లేఖ రాశారు. తనకు రక్షణ కల్పించాలని రాచకొండ సీపీని విజ్ఞప్తి చేశారు. అంతకుముందు మంచు మనోజ్ పహాడి షరీఫ్‌లో తనపై పది మంది వ్యక్తులు దాడి చేశారని, విజయ్, కిరణ్ సీసీటీవీ పుటేజ్ తీసుకెళ్లారని.. తనకు ప్రాణహాని ఉందని, ఈ నేపథ్యంలో రక్షణ కల్పించాలని మనోజ్ పోలీసులను కోరాడు. ఈ వ్యవహారంలో ఆల్రెడీ మంచు విష్ణు, మంచు లక్ష్మి కూడా ఎంటర్ అయ్యారు. మంచు కుటుంబ కథా చిత్రం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. మరి ఎలాంటి మలుపులు తిరుగుతుందనేది తెలియాల్సి ఉంది.