మంచు కుటుంబంలో గొడవలు ఎంతకీ సద్దుమణగడం లేదు.

మంచు కుటుంబంలో గొడవలు ఎంతకీ సద్దుమణగడం లేదు. ఈ క్రమంలో మోహన్ బాబు భార్య నిర్మల పోలీసులకు రాసిన లేఖ సంచలనంగా మారింది. పహాడి షరీఫ్ పోలీసులకు రాసిన లేఖలో emunnadante' డిసెంబర్ 24వ తేదిన నా పుట్టినరోజు సంద ర్భంగా నా పెద్ద కుమారుడు విష్ణు కేక్ తీసుకుని జలపల్లి లోని ఇంటికి వచ్చాడు. అందరం సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్నాము. అప్పుడే నా చిన్న కొడుకు మనోజ్ అక్కడికి వచ్చాడు. విష్ణు సీసీ ఫుటేజ్ ను బయటపెట్టాడు. తర్వాత విష్ణునే గొడవకు దిగిన్నట్టు లేనిపోని ఆభండాలు వేసాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేశాడని తెలిసింది. కానీ ఆ రోజు అలాంటి ఘటన ఏమి జరగలేదు. కేక్ కట్ చేసిన తర్వాత విష్ణు తన రూం లో ఉన్న సామను తీసుకున్నాడు. నా చిన్న కొడుకు మనోజ్ కు ఈ ఇంట్లో ఎంత హక్కు ఉందో అలాగే నా పెద్ద కొడుకు విష్ణు కు కూడా అంతే హక్కు ఉంది. ఆ సమయంలో విష్ణు ఎలాంటి దౌర్జన్యం చేయలేదు.
