హైద్రాబాద్ ఎల్బీనగర్ సాగర్ రోడ్‌లోనిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ స్లాబ్ కుప్పకూలింది. ఈ ఘటనలో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రోజు తెల్లవారుజామున 3.30-4 గంటల మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది.

Fallen flyover slab on Sagar Ring Road
హైద్రాబాద్(Hyderabad) ఎల్బీనగర్(LB Nagar) సాగర్ రోడ్(Sagar Road)లోనిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ స్లాబ్(Flyover Slab) కుప్పకూలింది. ఈ ఘటనలో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రోజు తెల్లవారుజామున 3.30-4 గంటల మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనా స్థలానికి జీహెచ్ఎంసీ(GHMC) డీఆర్ఎఫ్ సిబ్బంది, ఫోలీసులు(Police) చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని యూపీ(P)కి చెందిన రోహిత్ కుమార్(25), పునీత్ కుమార్ (25), శంకర్ లాల్(25), రవికుమార్(26), బీహార్ కు చెందిన జితేందర్ కుమార్(26), హరేరామ్(22), విక్కి కుమార్(23), రంగారెడ్డి(Rangareddy) జిల్లాకు చెందిన ఇంజనీర్ గోపాల కృష్ణ(29)గా గుర్తించారు. ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సివుంది.
