శ్రీ సాయి వెంకటేశ్వర క్లినిక్‌ను నడుపుతూ అమాయక రోగులను మోసం చేసి డబ్బులు గుంజుకుంటూ ఉన్నాడు

హైదరాబాద్ లో మరో నకిలీ డాక్టర్ ను పట్టేసుకున్నారు. కమీషనర్ టాస్క్ ఫోర్స్, సెంట్రల్ జోన్ బృందం.. వైద్య నిపుణుడి ముసుగులో వైద్యం చేస్తున్న నకిలీ వైద్యుడు రాజు గంగారాం అంకలాప్‌ను పట్టుకున్నారు. తప్పుడు ధృవీకరణ పత్రాలతో గంగారాం అంబర్‌పేటలో శ్రీ సాయి వెంకటేశ్వర క్లినిక్‌ను నడుపుతూ అమాయక రోగులను మోసం చేసి డబ్బులు గుంజుకుంటూ ఉన్నాడు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ఉన్నాడు. 53 ఏళ్ల వయస్సు ఉన్న అంకలాప్, హైదరాబాద్‌లోని రామంతపూర్ నివాసి, క్లినిక్‌లలో పనిచేస్తున్నప్పుడు ఆయుర్వేద, జనరల్ మెడిసిన్‌పై కొంత పరిజ్ఞానం సంపాదించాడు. అక్రమంగా సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో హైదరాబాద్‌లో సొంతంగా క్లినిక్‌ని నెలకొల్పేందుకు పథకం రూపొందించాడు.

అర్హతలు లేకుండా డాక్టర్‌గా పనిచేస్తున్న అంకలాప్ Dr. A. Raju, D.NYS, P.G.D.EM.S. (Mumbai), and Family Physician పేరుతో ప్రిస్క్రిప్షన్ లెటర్ ప్యాడ్‌ను ముద్రించాడు. సరైన వైద్య అర్హతలు లేకపోవడం, మెడికల్ బోర్డు నుండి అనుమతి లేకుండానే మందులను ఇస్తూ అమాయక రోగులను దోపిడీ చేశాడు. విశ్వసనీయ సమాచారం మేరకు సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ బృందం నకిలీ వైద్యుడిని పట్టుకుని అతని క్లినిక్ నుండి వివిధ మందులు, పలు వైద్య వస్తువులను స్వాధీనం చేసుకుంది.

డిస్పో వ్యాన్ ఇంజక్షన్లు- 20, సిరంజిలు- 15, ఇంజెక్షన్ల కోసం స్టెరైల్ వాటర్ బాటిల్స్- 03, నెబ్యులైజర్ మెషీన్లు- 2, ప్రిస్క్రిప్షన్ బుక్స్ - 8, స్టెతస్కోప్ - 1, వెయిజింగ్ మెషిన్- 1, పల్స్ ఆక్సిమీటర్- 1, డిజిటల్ ఫీవర్ చెక్, మల్టీవిటమిన్ ఇంజెక్షన్లు, టాబ్లెట్‌లు, 1,200 రూపాయల డబ్బులు సీజ్ చేశారు.

Updated On 14 March 2024 9:17 PM GMT
Yagnik

Yagnik

Next Story