గ్రూప్-1 అభ్యర్థుల(Group-1 candidates) చలో సెక్రటేరియెట్(Secretariat) ఉద్రిక్తంగా మారింది.
గ్రూప్-1 అభ్యర్థుల(Group-1 candidates) చలో సెక్రటేరియెట్(Secretariat) ఉద్రిక్తంగా మారింది. జీవో 29ని(GO-29) రద్దు చేసి గ్రూప్-1 పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు చేస్తున్న ఆందోళన ఉద్రిక్తంగా మారింది. వేలాది మంది విద్యార్థులు సచివాలయం గేటు వద్దకు చేరుకున్నారు. గత వారం రోజులుగా గ్రూప్-1 అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. అశోక్‌నగర్‌లో కూడా ఆందోళనలు చేయడంతో పోలీసులు లాఠీచార్జీ(lati charge) కూడా చేశారు. గ్రూప్-1 అభ్యర్థులకు బీఆర్‌ఎస్(BRS), బీజేపీ(BJP) అండగా నిలిచాయి. గ్రూప్-1 పరీక్షలు వాయిదా వేయాలని బీఆర్‌ఎస్ లీగల్‌గా ఫైట్ చేస్తోంది. సుప్రీంకోర్టులో(Supreme court) కూడా బీఆర్‌ఎస్ పిటిషన్ వేసింది. ఈరోజు కూడా ఆందోళనలు కొనసాగాయి. గ్రూప్-1 అభ్యర్థులకు మద్దతుగా కేంద్ర మంత్రి బండి సంజయ్(bandi sanjay) నిలిచారు. గ్రూప్-1 అభ్యర్థుల సెక్రటేరియెట్ ర్యాలీలో పాల్గొన్నారు. వందలాది మంది కార్యకర్తలు, అభ్యర్థులు ర్యాలీగా వచ్చారు. ఈ ర్యాలీలో బీఆర్‌ఎస్ నేతలు ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్(RS Praveen), శ్రీనివాస్‌గౌడ్(Srinivas Goud), దాసోజ్ శ్రవణ్(Dasoj Sravan) పాల్గొన్నారు. సచివాలయం ఎదుట ఉద్రిక్తత పరిస్థితి నెలకొనడంతో కేంద్రమంత్రి బండి సంజయ్‌ను అరెస్ట్ చేశారు. బీఆర్‌ఎస్ నేతలు ఆర్‌ఎస్పీ, శ్రీనివాస్‌గౌడ్, శ్రవణ్‌ను అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.