వివాహేతర సంబంధంతో ఓ క్యాబ్‌ డ్రైవర్‌ దారుణ హత్యకు గురయ్యాడు.

వివాహేతర సంబంధంతో ఓ క్యాబ్‌ డ్రైవర్‌ దారుణ హత్యకు గురయ్యాడు. మేడిపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ దారుణం జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం. పీర్జాదిగూడలోని మల్లికార్జుననగర్‌లో పద్మ(40) అనే మహిళ అనురార్‌ రెడ్డి బాయిస్‌ హాస్టల్‌ నడుపుతోంది. ఈ హాస్టల్‌లో ఓ క్యాబ్ డ్రైవర్‌ ఉండేవాడు. జనగామ జిల్లా బండ్లగూడెం గ్రామానికి చెందిన క్యాబ్‌ డ్రైవర్‌ మహేందర్‌ రెడ్డి (38)కి పద్మ(Padma)తో పరిచయం ఏర్పడింది. ఈ ఇద్దరి పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. అయితే గత కొంత కాలంగా ఇద్దరి మధ్య వివాదాలు రావడంతో మహేందర్‌ రెడ్డి హాస్టల్‌ నుంచి వెళ్లిపోయాడు. అయితే అప్పుడప్పుడు మళ్లీ హాస్టల్‌కు వచ్చేవాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం హాస్టల్‌కు రావాలని పద్మ మహేందర్‌రెడ్డిని పిలిచింది. అయితే మహేందర్‌రెడ్డి శనివారం రాత్రి హాస్టల్‌కు వెళ్లాడు. అదే సమయంలో ఓ గదిలో సూర్యాపేటకు చెందిన కిరణ్‌రెడ్డి(Kiran reddy), పద్మ కలిసి ఉన్నారు. దీంతో ముగ్గురి మధ్య ఘర్షన చెలరేగింది. ఈ గొడవలో కిరణ్‌రెడ్డి, పద్మ కత్తి, గరిటతో మహేందర్‌రెడ్డి(Mahendar reddy)పై దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ మహేందర్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

ehatv

ehatv

Next Story