నేడు దేశంలో చివరి దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. దీంతో దేశంలో ఎన్నికల పోలింగ్ హడావుడి ముగియనుంది. గెలుపుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Exit Poll Results 2024 Date and Time
నేడు దేశంలో చివరి దశ లోక్‌సభ ఎన్నికల(Loksabha Elections) పోలింగ్ జరుగనుంది. దీంతో దేశంలో ఎన్నికల పోలింగ్ హడావుడి ముగియనుంది. గెలుపుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో జూన్ 1వ తేదీ శనివారం సాయంత్రం 6:30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయొచ్చని ఎన్నికల సంఘం ప్రకటించింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 126ఏ(1) ప్రకారం నిబంధనలు పాటించాల్సిందేనని తాజా ఆదేశాల్లో ఈసీ(EC) పేర్కొంది.
లోక్‌సభ ఎన్నికలతో పాటు ఒడిషా, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, అలాగే దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లోని 25 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు, ఆరు దశల్లో లోక్ సభ ఎన్నికలు ఇప్పటివరకూ జరిగాయి.
కాగా నేడు ఏడో విడత లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. దీంతో దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది. జూన్ 4న ఫలితాలు వెలువడతాయి. ఈ సాయంత్రం పోలింగ్ సమయం ముగిసే వరకూ ఎగ్జిట్ పోల్స్ పై నిషేదం అమలులో ఉంటుంది.
పలు సర్వే సంస్థలు, వార్తా ఛానళ్లు పోలింగ్‌కు ఏడాది ముందు నుంచే తమ తమ సర్వేలను ఓటరుపై రుద్దే ప్రయత్నం చేశాయి. అయితే ఎన్నికల వేళ ప్రజలు ఎవరికి పట్టం కట్టారనేదే.. ఎవరు సరిగా ఓటరు నాడిని పట్టారనేది ఫలితాల తర్వాత మాత్రమే స్పష్టమవనుంది.
