ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు విచార‌ణ ఈ రోజు సుప్రీంలో జ‌రిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై ఆగస్టు 22లోగా కౌంట‌ర్‌ దాఖలు చేస్తామని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం సుప్రీంకోర్టుకు తెలిపింది

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు విచార‌ణ ఈ రోజు సుప్రీంలో జ‌రిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై ఆగస్టు 22లోగా కౌంట‌ర్‌ దాఖలు చేస్తామని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం సుప్రీంకోర్టుకు తెలిపింది.

ఈడీ, సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌వీ రాజు వాదిస్తూ.. న్యాయమూర్తులు బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనానికి ఈ కేసులో సీబీఐ కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసిందని.. ఈడీ కౌంటర్ అఫిడవిట్ ఆగస్టు 22 నాటికి దాఖలు చేస్తామని చెప్పారు. దీంతో ధర్మాసనం ఆగస్టు 27కి విచారణను వాయిదా వేసింది.

ఈడీ, సీబీఐ కేసుల్లో తనకు బెయిల్‌ను నిరాకరిస్తూ జూలై 1న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ కవిత దాఖలు చేసిన పిటిషన్లపై.. ఆగస్టు 12న సుప్రీంకోర్టు సీబీఐ, ఈడీల నుంచి స్పందన కోరింది. అంత‌కుముందు రెండు కేసుల్లోనూ కవిత బెయిల్ పిటిషన్‌లను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది.

పాలసీ రూపకల్పన, అమలులో అవినీతి, మనీలాండరింగ్‌కు సంబంధించి సీబీఐ, ఈడీ వేర్వేరుగా కేసులు నమోదు చేశాయి. మార్చి 15న హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని ఆమె నివాసం నుంచి కవితను ఈడీ అరెస్ట్ చేసింది. అవినీతి కేసులో ఏప్రిల్ 11న తీహార్ జైలు నుంచి ఆమెను సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ ఆరోపణలన్నింటినీ కవిత ఖండించారు.

Sreedhar Rao

Sreedhar Rao

Next Story