కల్తీ మద్యంపై మొట్టమొదటి పీడీ యాక్ట్(PD ACT) నమోదు చేసినట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్(srinivas Goud) తెలిపారు. ఇతర రాష్ట్రాలు, దేశాల నుండి హైదరాబాద్‌కు నకిలీ మద్యం తీసుకువచ్చి విక్రయిస్తున్నారని.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కల్తీ మద్యంపై మొట్టమొదటి పీడీ యాక్ట్(PD ACT) నమోదు చేసినట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్(srinivas Goud) తెలిపారు. ఇతర రాష్ట్రాలు, దేశాల నుండి హైదరాబాద్‌కు నకిలీ మద్యం తీసుకువచ్చి విక్రయిస్తున్నారని.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జార్ఖండ్(Jharkhand) వాసి రాజా రామ్ సింగ్(Raja Ram Singh) హర్యానా నుండి తీసుకువచ్చిన 330 బాటిల్స్ ను సీజ్ చేసామని వెల్లడించారు. ఆ మద్యాన్ని ల్యాబ్ లో టెస్ట్ చేయగా.. నకిలీ మద్యం అని తేలింది. రాజా రామ్ సింగ్ పై పీడీ యాక్ట్ నమోదు చేసామని తెలిపారు. విదేశీ మద్యం పేరుతో అక్రమంగా విక్రయిస్తున్నారని అన్నారు. ట్రాన్స్‌పోర్ట్ యజమానులు, ట్రావెల్స్ బస్సులలో తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నకిలీ మద్యం(Fake alcohol) వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని అన్నారు. రాష్ట్ర సరిహద్దుల్లో నిఘా పెంచుతాం.. చెక్ పోస్ట్ లను పటిష్టం గా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. నకిలీ మద్యం సరఫరా చేసే వారిపై ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.