దేశంలో అంబేద్కర్ రాజ్యంగం నడుస్తుందా..? బీజేపీ రాజ్యాంగం నడుస్తుందా..? అని మాజీ మంత్రి, మాజీ మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ ప్రశ్నించారు. గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హోంమంత్రిగా అమిత్ షా అన్ ఫిట్.. అని వ్యాఖ్యానించారు. ముస్లీం రిజర్వేషన్లు తొలగిస్తామనడం బీజేపీ ఆహంకానికి నిదర్శనమని ఫైర్ అయ్యారు. మత పరమైన రిజర్వేషన్లు చెల్లవని సుప్రీంకోర్టు చెప్పింది.. కానీ పేదలకు రిజర్వేషన్లు ఇవ్వాలని కూడా సూచించిందన్నారు.

Ex-Minister Mohammad Ali
దేశంలో అంబేద్కర్ రాజ్యంగం నడుస్తుందా..? బీజేపీ రాజ్యాంగం నడుస్తుందా..? అని మాజీ మంత్రి, మాజీ మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ(Ex-Minister Mohammad Ali) ప్రశ్నించారు. గాంధీభవన్(Gandhibhavan)లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హోంమంత్రిగా అమిత్ షా(Amit Shah) అన్ ఫిట్.. అని వ్యాఖ్యానించారు. ముస్లీం రిజర్వేషన్లు(Muslim Reservations) తొలగిస్తామనడం బీజేపీ ఆహంకానికి నిదర్శనమని ఫైర్ అయ్యారు. మత పరమైన రిజర్వేషన్లు చెల్లవని సుప్రీంకోర్టు చెప్పింది.. కానీ పేదలకు రిజర్వేషన్లు ఇవ్వాలని కూడా సూచించిందన్నారు. మా ప్రభుత్వం వెనకబడిన ముస్లీంలకు మాత్రమే రిజర్వేషన్లు ఇచ్చిందని పేర్కొన్నారు. పేద ముస్లీంలకు ఇచ్చే రిజర్వేషన్లు తొలగిస్తామంటే ఎలా.? అని ప్రశ్నించారు. మత పరంగా ముస్లీంలను శత్రువులుగా చూస్తే ఏలా..? అని నిలదీశారు. హోంమంత్రి రాజ్యంగ విరుద్ధంగా ఎలా మాట్లాడుతారని నిప్పులు చెరిగారు.
ముస్లీం రిజర్వేషన్లు(Muslim Reservations) తొలగించడం అమిత్ షా తరం కాదని అన్నారు. అమిత్ షా పై రాజ్యాంగ పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అమిత్ షా వాఖ్యలపై సుప్రీంకోర్టు(Supreme Court) లో పిటీషన్ వేస్తానని తెలిపారు. ఒక వర్గానికి అమిత్ షా హోంమంత్రి కాదు.. ఈ దేశానికి అన్న విషయం మర్చిపోయారని అన్నారు. మునుగోడు ఎన్నికలలో కేసీఆర్ కాంగ్రెస్‌కు రూ.25 కోర్టు ఇచ్చారన్న ఈటెల వ్యాఖ్యలపై మాట్లాడుతూ.. ప్రభుత్వ స్కూళ్లలో చదువుకున్నానని చెప్పుకునే ఈటెలకు ఇన్ని కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. మునుగోడు ఉప ఎన్నిక జరిగిన 6 నెలల తర్వాత ఈటెల ఇప్పుడు ఆరోపణలు చేయడం ఏంటి అని నిలదీశారు. ఈటెల కాంగ్రెస్ లోకి వస్తా అని మా తలుపులు తట్టలేదా..? అంటూ ప్రశ్నించారు.
