తెలంగాణ దాచిపెట్టుకున్న కృష్ణా నీళ్లను ఏపీ ఎత్తుకెళ్తున్నా రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోందని జగదీష్‌రెడ్డి అన్నారు.

తెలంగాణ దాచిపెట్టుకున్న కృష్ణా నీళ్లను ఏపీ ఎత్తుకెళ్తున్నా రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోందని జగదీష్‌రెడ్డి అన్నారు. ఏపీ నీటి దోపిడీతో తెలంగాణ లో సాగు ,తాగు నీళ్లకు కటకట ఏర్పడే పరిస్థితి ఉందని మాజీ మంత్రి హరీష్ రావు గారు చెప్పారని.. హరీష్ రావు ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మంత్రి ఉత్తమ్ చెత్త మాటలు మాట్లాడారు, .ఉత్తంవి ఉత్తరకుమార మాటలు, రాష్ట్రానికి పొంచి ఉన్న ప్రమాదం గురించి మాట్లాడితే కాంగ్రెస్ నేతలు రాజకీయాలు మాట్లాడుతున్నారని జగదీష్‌రెడ్డి విమర్శించారు. చంద్రబాబు ,రేవంత్ రెడ్డి ,కాంగ్రెస్ ,బీజేపీ లే తెలంగాణ కు సరైన నీటి వాటా దక్కక పోవడానికి కారణమన్నారు. రేవంత్ రెడ్డి తిట్లతో సీఎం అయ్యారు .తాను కూడా అదే భాష తో మాట్లాడితే సీఎం అవుతా అని ఉత్తమ్
కృష్ణా జలాల్లో 50 శాతం వాటా కోసం ప్రయత్నిస్తున్నాం అని ఉత్తమ్ అంటున్నారు ..ముందు ఉన్న పంటలను కాపాడటంపై దృష్టి పెట్టాలన్నారు.
మోడికి, చంద్రబాబుకు ఉత్తమ్ భయపడుతున్నారు, ..జగన్ (Ys Jagan)సీఎంగా రాష్ట్రానికి వస్తే గౌరవించుకోవద్దా ? మీరు చంద్రబాబు(Chandra Babu) దగ్గరికి క్యూ కట్టలేదా ? అదే చంద్రబాబు సాగర్‌పై కుట్రలు చేస్తోంటే ఇక్కడి నుంచి తరిమేశామన్నారు. మాట్లాడటానికి సిగ్గు ఉండాలని జగదీష్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అవినీతి గురించి మాట్లాడుకుంటే అవినీతి అనే పదమే సిగ్గుపడుతుందని.. ప్రతి దాంట్లో కమీషన్ అడుగుతున్న కాంగ్రెస్ నేతలా కేసీఆర్(KCR) గురించి మాట్లాడేదని ప్రశ్నించారు. మంత్రుల అవినీతి సంపాదన చిట్టా మా దగ్గర ఉంది ..ప్రజలు కూడా చర్చించుకుంటున్నారని.. కాంగ్రెస్ కార్యకర్తల దగ్గర మంత్రులు కమీషన్ తీసుకుంటున్నారు. చంద్రబాబు సాగర్ శ్రీశైలం ప్రాజెక్టు లను మరో పోలవరం ప్రాజెక్టు లుగా మారుస్తున్నాడని.. కృష్ణా జలాలపై సోయి లేకుండా సొల్లు పురాణం చెబుతున్నారని విమర్శించారు. కాళేశ్వరాన్ని ఎండబెట్టారు కనుకే గతంలో మాదిరిగా సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు నీళ్లు రావడం లేదని.. ఎస్సారెస్పీ నీళ్లే అయితే ఇపుడు మాకు నీళ్లు ఎందుకు రావడం లేదని.. కేసీఆర్ ను తిట్టడం బంద్ చేసి కృష్ణా జలాల వాటాను సాధించు కోవడం మీద మంత్రులు దృష్టిపెట్టాలని జగదీష్‌రెడ్డి( Jagadish Reddy) అన్నారు. ఇప్పటికైనా సోయి తెచ్చుకుని సాగర్ ,శ్రీశైలం ప్రాజెక్టు ల్లో తెలంగాణ కు న్యాయమైన వాటా దక్కేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని.. అసలు నీళ్లను ఎట్లా కొలుస్తారో కాంగ్రెస్ నేతలకు తెలుసా అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఉద్యమం నుంచే టీఎంసీ(TMC) ల గురించి అవగాహన కల్పించారు, కేసీఆర్‌ను విమర్శించడానికి కిషన్ రెడ్డి(Kishan Reddy), బండి సంజయ్(Bandi Sanjay) లకు సిగ్గుండాలని, కేంద్రమంత్రులుగా ఉన్న వారు కే ఆర్ ఎం బి అధికారులతో మాట్లాడి తెలంగాణ కు రావల్సిన నీళ్లు సాధించడం చేతకాదా అని ప్రశ్నించారు. కోమటి రెడ్డి మీడియా తో మాట్లాడే ముందు ఏ స్థితిలో ఉన్నారో తెలుసుకునేందుకు ఆయన నోటిలో పైపు పెట్టాలి, కోమటి రెడ్డి ఓ మనిషిలా మాట్లాడటం లేదని జగదీష్‌రెడ్డి అన్నారు.
