రైతు బంధుపై రేవంత్ దొంగ నాటకాలు ఆడుతున్నారని మాజీమంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. రైతు బంధుని వేసినట్టు చేసి మళ్లీ ఆగేలా చేశార‌ని ఆరోపించారు.

రైతు బంధుపై రేవంత్ దొంగ నాటకాలు ఆడుతున్నారని మాజీమంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. రైతు బంధుని వేసినట్టు చేసి మళ్లీ ఆగేలా చేశార‌ని ఆరోపించారు. నల్గొండ బిఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డికి మద్దతుగా ఆత్మకూరు( s) మండల కేంద్రంలో ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి గడపగడప ప్రచారం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. రైతుల విషయంలో రాజీ లేదు.. ఓట్ల రాజకీయం మాకు అవసరంలేదన్నారు.

ఎన్నికల కమీషన్ కి రాయండి మద్దతిస్తామని గతంలోనే కేసీఆర్ చెప్పారని గుర్తుచేశారు. యాసంగి సాయం అందకముందే ఖరీఫ్ సీజన్ మొదలైందన్నారు. ఖరీఫ్ రైతు భరోసా పై రేవంత్ ప్రమాణం, ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. పథకాలు ఇచ్చే ఉద్దేశం లేక కుంటి సాకులు చెబుతున్నారని అన్నారు. ఎన్నికల కమీషన్ దృష్టిలో పడాలనే రేవంత్ వ్యాఖ్యలు చేశార‌న్నారు. రేవంత్ ఇచ్చినట్టు.. ఈసీ ఆపినట్టుంది వ్యవహారం అన్నారు.

రైతు బంధు ను ఎప్పుడు తాము ఆపమనలేదన్నారు. రేవంత్ వ్యవహారం చూస్తే రైతు బంధు ఇక కొనసాగేలా కనిపించడంలేదన్నారు. రైతులకు ఇదే చివరి రైతు బంధులా కనపడుతుందన్నారు. కేసీఆర్ కి మద్దతిస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పినట్లు అవుతుందన్నారు. గోదావరి జలాలు తమిళనాడుకు పంచే కుట్ర జరుగుతుందన్నారు. బీజేపీ గోదావరి జలాలు తమిళనాడు తరలింపు అంశానికి కాంగ్రెస్ మద్దతు ఇస్తుందన్నారు.

అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తడిసిన ధాన్యం మద్దతు ధరకు కొనుగోలు చేయాలని కోరారు. ఐకేపీల్లో ధాన్యం కొనుగోళ్ళు ఆలస్యం వల్లే అకాల వర్షాలకు నష్టం జరుగుతుందన్నారు.

Updated On 8 May 2024 1:55 AM GMT
Yagnik

Yagnik

Next Story