ఈ విస్తృత స్థాయి సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గం

ఈ విస్తృత స్థాయి సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా పార్టీ అధ్యక్షులు, ప్రస్తుత మరియు మాజీ ఎంపీలు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డిసిసిబి, డిసిఎంఎస్ అధ్యక్షులు, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జీలు హాజరయ్యారు. తెలంగాణలో మళ్లీ వందశాతం అధికారంలోకి వస్తామని కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. . భేటీలో బీఆర్‌ఎస్‌ సిల్వర్‌ జూబ్లీ వేడుకలపై కార్యక్రమాల నిర్వహణపై, సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీలు, ప్లీనరి అంశాలపై నేతలతో కేసీఆర్‌ చర్చించారు. ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భావం మొదలు ఇప్పటి వరకు సుదీర్ఘ ప్రస్థానాన్ని పార్టీ నేతలకు గుర్తు చేశారు. తెలంగాణలో కచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయన్నారు. ఏప్రిల్‌లో బీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభ ఉంటుందన్నారు. ఏప్రిల్ మొదటివారంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందన్నారు. ప్రతి జిల్లాలో సభ్యత్వ నమోదు కేంద్రాలుంటాయన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ గ్రాఫ్‌ పూర్తిగా పడిపోతుందని.. కాంగ్రెస్‌ను లేపడం చాలా కష్టమన్నారు కేసీఆర్. పార్టీ సిల్వర్‌ జూబ్లీ వేడుకలు చేసి 25 ఏళ్ల స్ఫూర్తితో ఏడాది మొత్తం కార్యక్రమాలు చేయాలన్నారు.

ehatv

ehatv

Next Story