ఆయన అసెంబ్లీ సమావేశాలకు వస్తారని అందరూ భావించారు. కానీ ఆయన
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో.. రాష్ట్ర ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బడ్జెట్ సమావేశాలకు గైర్హాజరు అవుతున్నారు. ఇటీవల అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్ లో ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణస్వీకారం చేశారు. ఆయన అసెంబ్లీ సమావేశాలకు వస్తారని అందరూ భావించారు. కానీ ఆయన రాలేదు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ తమిళిసై ప్రసంగానికి కానీ, ఆమె ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చ సందర్భంగా కానీ సభకు కేసీఆర్ రాలేదు. బడ్జెట్ సందర్భంగా ఆయన వస్తారని భావించినప్పటికీ, ఆయన రావడం లేదనే సమాచారం అందింది. కేసీఆర్ ప్రస్తుతం బంజారాహిల్స్, నంది నగర్ లోని తన నివాసంలోనే ఉన్నారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని అసెంబ్లీలో ఆర్థిక మంత్రి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు. అమరవీరులు దేనికోసమైతే త్యాగాలు చేశారో వాటిని సాధిస్తామని పేర్కొన్నారు. ధనిక రాష్ట్రంలోనూ ప్రజలు కష్టాలతో సతమతం కావడానికి గత ప్రభుత్వ విధానాలే కారణమన్నారు. మార్పు కోరుతూ స్వేచ్ఛను సాధించుకున్నారంటూ రాష్ట్ర ప్రజలకు భట్టి విక్రమార్క కృతజ్ఞతలు తెలియజేశారు. ఆరు గ్యారంటీల అమలుకు ప్రాధాన్యత కల్పించడంతో పాటు సంక్షేమం-అభివృద్ధే ధ్యేయంగా బడ్జెట్ ను ప్రవేశపెట్టినట్లు చెప్పారు.