ప్రభుత్వంలో ఆర్టీసీ(RTC) విలీనం బిల్లు విషయంలో గవర్నర్‌పై(Governer) బట్టకాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నారని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Etela Rajendar) అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వ‌ద్ద ఆయ‌న మాట్లాడుతూ.. గవర్నర్ కు ఒక్క రోజు ముందే బిల్లు పంపారని.. గవర్నర్ బిల్లు చూడాలి, చదవాలి, సంతకం చేయాలని వివ‌రించారు. గవర్నర్ హైదరాబాద్ లో అందుబాటులో లేరని చెబుతున్నా.. ప్రభుత్వం హడావుడి చేస్తోందని

ప్రభుత్వంలో ఆర్టీసీ(RTC) విలీనం బిల్లు విషయంలో గవర్నర్‌పై(Governer) బట్టకాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నారని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Etela Rajendar) అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వ‌ద్ద ఆయ‌న మాట్లాడుతూ.. గవర్నర్ కు ఒక్క రోజు ముందే బిల్లు పంపారని.. గవర్నర్ బిల్లు చూడాలి, చదవాలి, సంతకం చేయాలని వివ‌రించారు. గవర్నర్ హైదరాబాద్ లో అందుబాటులో లేరని చెబుతున్నా.. ప్రభుత్వం హడావుడి చేస్తోందని అన్నారు.

గెస్ట్ లెక్చరర్స్, సెకండ్ ఏఎన్ఎంలు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, మహిళా సంఘాలు అనేక మంది తమ సమస్యలు చెప్పుకుందామంటే ఎవరు పట్టించుకోవడం లేదని అన్నారు. మంత్రులు, అధికారులు భరోసా ఇవ్వడం లేదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సీఎం కేసీఆర్(CM KCR) ఎవరికీ అందుబాటులో ఉండరని విమ‌ర్శించారు. సమస్యలపై చర్చించడానికి అసెంబ్లీ నిర్వహించాలని.. మొక్కుబడిగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారని అన్నారు. ఒకరోజు హరీష్ రావు, ఒకరోజు కేటీఆర్ దాడి చేశారు. రేపు కేసీఆర్ దాడి చేస్తారని ఎద్దేవా చేశారు.

ఆర్టీసీలో సంస్థకు సంబంధించి 6 వేల బస్సులు మాత్రమే నడుస్తున్నాయని అన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనాన్ని స్వాగతిస్తున్నామ‌న్నారు. ఆర్టీసీ కార్మికులకు రెండు పీఆర్సీలు బకాయిలు పడ్డారని ప్ర‌భుత్వానికి తెలిపారు. ఆర్టీసీలో పనిచేసే ఇతర సిబ్బందిని కూడా పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.

గవర్నర్ కు ఆర్టీసి బిల్లు మొన్ననే పంపారు.. అందుబాటులో లేరని చెబుతున్నారు. బట్టకాల్చి మీదేసినట్లు ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమ‌ర్శించారు. ఆర్టీసీ కార్మికులను(RTC workers) బలవంతంగా గవర్నర్ కార్యాలయం ముందు ధర్నాకు(Protest) తీసుకువస్తున్నారని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితి లేదని అన్నారు. వచ్చే ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయని ఈటెల వ్యాఖ్యానించారు.

Updated On 5 Aug 2023 5:21 AM GMT
Ehatv

Ehatv

Next Story