తెలంగాణ బీజేపీలో రోజుకో కొత్త చర్చ జరుగుతుంది... తాజాగా చేరికల కమిటీకి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రాజీనామా చేసారు... పార్టీలో తగిన గుర్తింపు లేకపోవడం వల్ల ఈటల అసంతృప్తిగా ఉన్నారట.. మొక్కుబడిగా చేరికల కమిటీకి అధ్యక్షుడిని చేశారని, దానివల్ల ఒరిగే ప్రయోజనం లేదని ఈటల భావిస్తున్నారట.

తెలంగాణ బీజేపీలో రోజుకో కొత్త చర్చ జరుగుతుంది... తాజాగా చేరికల కమిటీకి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రాజీనామా చేసారు... పార్టీలో తగిన గుర్తింపు లేకపోవడం వల్ల ఈటల అసంతృప్తిగా ఉన్నారట.. మొక్కుబడిగా చేరికల కమిటీకి అధ్యక్షుడిని చేశారని, దానివల్ల ఒరిగే ప్రయోజనం లేదని ఈటల భావిస్తున్నారట. అయితే గత రెండు రోజులుగా ఈటల రాజేందర్ ఢిల్లీలో ఉన్నట్టు తెలుస్తుంది, చేరికల కమిటీకి రాజీనామా చేసిన విషయం తెలుసుకున్న అమిత్ షా.. ఈటలను ఢిల్లీకి పిలిపించి రాజీనామాకు గల కారణాలను తెలుసుకుంటున్నారు.

ఈటలకు టీ-బీజేపీ పగ్గాలు.?

తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడిపై రోజుకో చర్చ జరుగుతుంది... ప్రస్తుతం బండి అధ్యక్షుడిగా ఉండగా, అయన అధ్యక్షతను పార్టీలోని కొంత మందికి నచ్చడం లేదని తెలుస్తుంది. తాజాగా కవితపై బండి చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ నేతలే తప్పుపట్టారు, వారిలో ముఖ్యంగా ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీసాయి. అయితే టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి ఉపఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి గెలిచిన ఈటలకు బీజేపీలో తగిన గౌరవం రాలేదని అయన కొంత నిరుత్సాహంతో ఉన్నారని తెలుస్తుంది.. టీఆర్ఎస్‏లో ఎప్పుడు యాక్టీవ్‏గా ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే వారు.. కానీ రాష్ట్ర బీజేపీలో ఆయనకు అలాంటి అవకాశం రానివ్వకుండా చేస్తున్నారనే వాదన ఉంది.

ఈటలకు బీజేపీ పెద్దల మద్దతు ఎక్కువగా ఉంది... అమిత్ షా, నడ్డా తెలంగాణకు ఎప్పుడు వచ్చిన తగిన గౌరవం ఇస్తూ పార్టీలో ప్రధాననాయకుడి పరిగణిస్తారు, అయితే ఈటల ఢిల్లీలో మకాం వేయడంపై రాజకీయావర్గాల్లో కొత్త చర్చ జరుగుతుంది.. పార్టీలో అసంతృప్తిగా ఉన్న ఈటలకు తెలంగాణ అధ్యక్షుడి బాధ్యతలు అప్పచెబుతారని.. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఈటల ఎక్కువగా ఉపయోగపడతారని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారట.. అందుకే ఈటల గత రెండు రోజులుగా ఢిల్లీలో ఉంటూ బీజేపీ పెద్దలను కలుస్తునట్టు సమాచారం. మరి కొద్ది నెలల్లో తెలంగాణకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈటలకు అవకాశమిస్తే పార్టీ మరింత పుంజుకొని అధికారం చేపట్టే అవకాశాలు ఉన్నాయని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం. ఇదేకాని నిజమైతే ఈటల మరి కొద్ది రోజుల్లో తెలంగాణ బీజేపీ అధ్యక్షడిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.

Updated On 16 March 2023 8:07 AM GMT
Ehatv

Ehatv

Next Story