బీజేపీ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ భద్రత విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వం 'Y' ప్లస్ కేటగిరీ సెక్యూరిటీని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
బీజేపీ నేత, హుజురాబాద్(Huzurabad) ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ (Etala Rajender) భద్రత విషయంలో తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వం 'Y' ప్లస్ కేటగిరీ(Y Plus Security) సెక్యూరిటీని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శనివారం ఉదయం నుంచి ఉత్తర్వులు అమలులోకి వస్తాయి. దీంతో సిబ్బంది ఈ ఉదయం నుంచి ఈటెలకు భద్రతగా ఉంటుంది. ఇక 'Y' ప్లస్ కేటగిరీ భద్రతలో.. బుల్లెట్ ప్రూఫ్(Bullet Proof) వెహికల్‌తో పాటు 16మంది సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు.
ఈటెల రాజేందర్ హత్యకు కుట్ర జరుగుతుందని.. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి (MLC Kaushik Reddy) ఆయనను హతమార్చేందుకు కుట్ర చేస్తున్నారని ఇటీవల ఆయన సతీమణి జమున (Jamuna) ఆరోపణలు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈటెల కూడా పలుమార్లు కౌశిక్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రగతి భవన్(Pragathi Bhavan) సపోర్టుతోనే కౌశిక్ రెడ్డి రెచ్చిపోతున్నాడని సంచలన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈటెలకు కేంద్రం భద్రత కేటాయిస్తుందని వార్తలు రాగా.. రాష్ట్ర మంత్రి కేటీఆర్(KTR) స్పందింస్తూ.. ఈటెల భద్రత విషయమై డీజీపీ(DGP)తో మాట్లాడుతానని.. అదనపు సెక్యూరిటీ సిబ్బందిని కేటాయిస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది.