పార్టీ మార్పు వార్తలపై బీజేపీ(BJP) ఎమ్మెల్యే ఈటెల రాజేందర్(Etela Rajendar) ఘాటుగా స్పందించారు. తాను పార్టీ మారనని స్పష్టం చేశారు. తాను రోజుకో పార్టీ మారే వ్యక్తిని కాదన్నారు. నేను బయటికి వెళ్లాలని మా పార్టీలో కొందరు కోరుకుంటున్నారని.. ఎవరు అలా కోరుకుంటున్నారో మీకు తెలుసు..
పార్టీ మార్పు వార్తలపై బీజేపీ(BJP) ఎమ్మెల్యే ఈటెల రాజేందర్(Etela Rajendar) ఘాటుగా స్పందించారు. తాను పార్టీ మారనని స్పష్టం చేశారు. తాను రోజుకో పార్టీ మారే వ్యక్తిని కాదన్నారు. నేను బయటికి వెళ్లాలని మా పార్టీలో కొందరు కోరుకుంటున్నారని.. ఎవరు అలా కోరుకుంటున్నారో మీకు తెలుసు.. అలాంటి చిల్లర గాళ్లను పట్టించుకోనని సంచలన కామెంట్స్ చేశారు.
ఇదిలావుంటే.. బీజేపీ నేతలు(BJP) ఈటెల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy) రేపు రాహుల్ గాంధీతో(Rahul gandhi) భేటీ కానున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti srinivas Reddy), జూపల్లి కృష్ణారావు(Jupelli Krishna Rao) కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న నేపథ్యంలో.. మరికొందరు నేతలు కూడా ఆపరేషన్ సామాజిక తెలంగాణ పేరుతో కాంగ్రెస్ లోకి క్యూ కడుతున్నారనే వార్తలు పెనుదుమారం రేపుతున్నాయి. ఈటెల, రాజగోపాల్ రెడ్డితో పాటు.. బీఆర్ఎస్‌కు చెందిన పట్నం మహేందర్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, అరికేపూడి గాంధీ, వంటేరు ప్రతాప్ రెడ్డి, బీజేపీకి చెందిన విజయశాంతి, డీకే అరుణ తదితరులు కాంగ్రెస్‌లో చేరనున్నట్లు విస్తృత ప్రచారం జరుగుతోంది.