మాజీ మంత్రి ఈటల రాజేందర్(Etela Rajender ) సమర్పించిన అఫిడవిట్(affidavit) లో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఆరుసార్లు ఎమ్మెల్యేగా..ఏడేళ్లు మంత్రిగా పని చేసిన ఈటల రాజేందర్‎కు సొంత కారుగానీ, బైక్ గానీ లేదు. విలువైన బంగారం కూడా లేదు.

మాజీ మంత్రి ఈటల రాజేందర్(Etela Rajender ) సమర్పించిన అఫిడవిట్(affidavit) లో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఆరుసార్లు ఎమ్మెల్యేగా..ఏడేళ్లు మంత్రిగా పని చేసిన ఈటల రాజేందర్‎కు సొంత కారుగానీ, బైక్ గానీ లేదు. విలువైన బంగారం కూడా లేదు. ఈ విషయాన్ని ఆయన ఎన్నికల కమిషన్(Election Commission) కు సర్పించిన అఫిడవిట్‎లో వెల్లడించారు. ఈటల తరుఫున తన సోదారుడు భద్రయ్య(Bhadraiah) మంగళవారం నామినేషన్(Nomination) దాఖలు చేశారు. ఎలక్షన్ కమిషన్‌ అధికారులకు ఈటల ఆస్తులు, అప్పులతో కూడిన పూర్తి వివరాలతో కూడిన అఫిడవిట్ సమర్పించారు.

ఈసారి ఈటల రాజేందర్ అటు హుజురాబాద్(Huzurabad), ఇటు గజ్వేల్‌(Gajwel) నుంచి పోటీ చేస్తున్నాఉ. ఏకంగా సీఎం కేసీఆర్‌తోనే(KCR) ఈసారి తలపడుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేత ఈటల రాజేందర్ నామినేషన్లు దాఖలు చేశారు. ఆ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో ఆయన తన ఆస్తులు, కేసులు వంటి వివరాలను వెల్లడించారు. ఈటలపై తెలంగాణ ఉద్యమ సమయంతోపాటు ఎన్నికల సమయంలో పెట్టిన మొత్తం కలిపి 40పైగా కేసులున్నాయి.

ఎన్నికల కమిషన్‎కు సమర్పించిన అఫిడవిట్ ప్రకారం..ఈటల రాజేందర్ పేరు మీద 6,74,473 రూపాయల ఆస్తి ఉంది. కానీ.. ఈటల రాజేందర్ సతీమణి జమున పేరు మీద షేర్స్, బాండ్స్, వాహనాలు, పర్సనల్ అడ్వాన్స్ కలిపి 26,48,70, 394 విలువగల చరాస్థులు ఉన్నాయని అధికారంగా వెల్లడించారు.అలాగే ఈటల రాజేందర్ దగ్గర ప్రస్తుతం లక్ష రూపాయలు మాత్రమే ఉన్నాయి. అటు ఈటల సతీమణి జమున చేతిలో కేవలం లక్షన్నర నగదు ఉన్నట్టు వెల్లడించారు. ఈటల రాజేందర్ స్థిరాస్తుల విలువ ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం రూ. 12.50 కోట్లు ఉన్నాయి.

ఇక్కడే కొన్ని ఆసక్తికర విషయాలు బయటకొచ్చాయి. ఈటల రాజేందర్ పేరిట కార్లు కానీ, బైక్‌లు కానీ, బంగారం కానీ లేవు. అయితే ఈటల రాజేందర్ భార్య జమున పేరిట మూడు ఇన్నోవా, సీఆర్వీ వాహనాలు, క్రిస్ట ఉన్నాయి. అలాగే ఆమెకు 50 లక్షల రూపాయలు విలువ చేసే ఒకటిన్నర కేజీల బంగారం ఉంది. జమున పేరుమీద జుమున హ్యాచరీస్‌తో పాటు అభయ డెవలపర్స్, నార్త్ ఈస్ట్ ప్రాజెక్ట్స్, ఎష్వీఎస్ అర్చవాన్ అండ్ డొలరైట్ అనే కంపెనీల్లో పెట్టుబడులు ఉన్నాయి.

Updated On 10 Nov 2023 5:22 AM GMT
Ehatv

Ehatv

Next Story