కె. నాగేశ్వర్ ప్రొఫెసర్(Prf K. Nageshwar ), రాజకీయవేత్త, రాజకీయ విశ్లేషకులు.

కె. నాగేశ్వర్ ప్రొఫెసర్(Prf K. Nageshwar ), రాజకీయవేత్త, రాజకీయ విశ్లేషకులు. 2007 నుంచి 2015 వరకు ఆంధ్ర ప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యునిగా పనిచేశారు. తదనంతరం తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో సభ్యుడిగా పనిచేశారు. నాగేశ్వర్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని(OU) కమ్యూనికేషన్ & జర్నలిజం విభాగంలో ప్రొఫెసర్‌గా ఉన్నారు. రాజకీయాలపై తన చానెల్‌లో తనదైన శైలిలో విశ్లేషణలు(Political analysis) చేస్తుంటారు. పలు టీవీ డిబెట్లలో పాల్గొంటూ రాజకీయాలపై విశ్లేషణలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే నాగేశ్వర్‌పై ఈటల రాజేందర్‌ ఒక్కసారిగా మండిపడ్డారు. హైదరాబాద్‌లో ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా హైడ్రా(Hydra) మారింది. ఆక్రమణలను, చెరువుల్లో కబ్జాచేసిన నిర్మాణాలను కూలగొడుతోంది. హైడ్రాపై కూడా నాగేశ్వర్‌ విశ్లేషణలు చేశారు. హైడ్రా చాలా చక్కగా పనిచేస్తోందని, సీఎం రేవంత్‌రెడ్డి సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. పలు బస్తీలకు హైడ్రా నోటీసులు కూడా ఇచ్చింది. చెరువు శిఖం భూముల్లో చిన్నచిన్న ఇళ్లు ఏర్పాటు చేసుకొని గత కొన్నేళ్లుగా జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈటల(Etela Rajender) నియోజకవర్గం మల్కాజ్‌గిరిలోని(Malkajgiri) హస్మత్‌పేట బస్తీలో ఉంటున్న 120 మంది ఇళ్లకు హైడ్రా నోటీసులు ఇచ్చింది. దీనిపై ఈటల మండిపడ్డారు. చిన్నచిన్న బస్తీల్లో ఉంటున్న పేదల ఇళ్లు ఎలా కూలగొడతారని ఈటల ప్రశ్నించారు. మీడియాతో మాట్లాడుతూ ప్రొ.నాగేశ్వర్‌పై మండిపడ్డారు. రేవంత్‌రెడ్డిపై అకస్మాత్తుగా ప్రొ.నాగేశ్వర్‌కు ప్రేమ ఎందుకు వచ్చిందన్నారు. రేవంత్‌రెడ్డి ఏదో తెలంగాణ ఉద్యమకారుడైనట్లు, ఆయనే తెలంగాణ అభివృద్ధి కామకుడు అయినట్లు నాగేశ్వర్‌ మాట్లాడడం కరెక్ట్‌ కాదన్నారు. రేవంత్‌రెడ్డి(Revanth reddy) గొప్ప ప్రగతి కామకుడు, గొప్ప సంఘ సంస్కర్త, రేవంత్‌రెడ్డే ఈ రాష్ట్రాన్ని రక్షించగలడు అన్నట్లు నాగేశ్వర్‌ భుజాల మీదికి ఎత్తుకుంటే తమకు ఎలాంటి బాధలేదని ఈటల అన్నారు. కానీ నాగేశ్వర్‌కు ఒక్క ఎన్‌-కన్వేషనే కనపడుతుందా.. ఈ పేదల బస్తీలు కనపడతలేవా అని ప్రశ్నించారు. దీనిపై నాగేశ్వర్‌ స్పందిస్తూ పేదల గురించి నాకు తెలియదన్నట్లు ఈటల మాట్లాడుతున్నారు. గతంలో కాంట్రాక్ట్‌ ఔట్‌ సోర్సింగ్ ఉద్యోగుల కోసం నేను ధర్నా చేస్తే టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత ఈటల వచ్చి నాకు సానుభూతి తెలపలేదా అన్నారు. పేదల సమస్యలపై చట్ట సభల్లో ఎన్నో సందర్భాల్లో నేనే మాట్లాడిన అని నాగేశ్వర్‌ అన్నారు. గతంలో చిన్నచిన్న ఉద్యోగులకు జీతాలు పెంచాలని కోరితే ఆర్థిక మంత్రిగా ఉన్న ఈటల ఎందుకు పెంచలేదన్నారు. మల్కాజ్‌గిరిలో పేద ప్రజల కోసం పోరాడండి. జవహర్‌నగర్‌ డంప్‌ యార్డును ఎత్తివేసే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డిని నేను ఎందుకు పొగుడుతానని, నాకు రేవంత్‌ ఏ పదవి ఇచ్చినా తీసుకోనన్నారు. హైడ్రా వచ్చినప్పటి నుంచి ఈటల రాజేందర్‌ పర్సనల్‌గా చాలా డిస్టర్బ్ అవుతున్నాడని నాగేశ్వర్‌ అన్నారు. ఎన్‌-కన్వేన్షన్‌ కూలగొడితే ఈటల రాజేందర్‌కు అంత బాధెందుకు అని ప్రశ్నించారు. అయితే దీనికి దీటుగా నాగేశ్వర్‌పై బీజేపీ కార్యకర్తలు మండి పడుతున్నారు. నాగేశ్వర్‌కు ఫోన్లు చేసి ఈటలను అనేంత పెద్దవాడివా నువ్వు అంటూ ఫోన్లు చేస్తున్నారు. ఇరువర్గాల మధ్య వివాదం తారాస్థాయికి చేరడంతో ఈ వ్యవహారం ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.

Eha Tv

Eha Tv

Next Story