తెలంగాణలో హైడ్రాపై(Hydra) అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

తెలంగాణలో హైడ్రాపై(Hydra) అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అధికారపార్టీ వైఖరిని బీఆర్‌ఎస్‌(BRS), బీజేపీ(BJP) తప్పుపడుతున్నాయి. హైడ్రాపై ఈటల(Etela rajendra) విమర్శల బాణాలు రేవంత్‌రెడ్డికి(Revanth reddy) గుచ్చుకుంటున్నాయి. రేవంత్‌రెడ్డికి దమ్ముంటే ఇద్దరం వితౌట్ సెక్యూరిటీ మూసి పరివాహక ప్రాంతంలో కూలగొట్టబోతున్న ఇళ్ళ దగ్గరికి వెళ్దాం. ఒకరోజు రెండు రోజుల డేట్ పెట్టండి. చైతన్యపురిలాంటి కాలనీలకు పోదాం. శభాష్ రేవంత్ రెడ్డి అంటే నేను.. రాజకీయాల్ని తప్పుకుంటాను. బహిరంగంగా క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాస్తానని ఈటల అన్నారు. దీంతో సీఎం రేవంత్‌ కూడా ఈటలపై ఒంటికాలితో లేచారు. ఎంపీగా గెలిచారు కదా. మోడీ దగ్గర నుంచి ఎన్ని నిధులు తీసుకొస్తవో తీసుకురావాలన్నారు. ఇద్దరం కలిసి మోడీ దగ్గరికి వెళ్దాం.. ఓ 25 వేల కోట్లు తీసుకొద్దామన్నారు. కేటీఆర్, హరీశ్ రావు మొదటిరోజు మాట్లాడుతారు..తెల్లారి ఆ జిరాక్స్ కాపీ తీసుకొని ఈటల రాజేందర్ మాట్లాడుతారు. మీ బాగోతం... అందరికి అర్థమైతలేదా.. పదేళ్లు నువ్వు మంత్రిగా ఉండి వెలుగబెట్టింది ఏందో తెలంగాణ సమాజం గమనించలేదా అని ప్రశ్నించారు. మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న పేదలకు ఇండ్ల పట్టాలతో పాటు ప్రధానమంత్రి ఆవాస యోజనలో ఇండ్లు కట్టిద్దాం.. మీరు రండి నరేంద్ర మోదీ దగ్గరకు వెళ్దాం..నేనూ వస్తా..నా మంత్రివర్గాన్ని మొత్తం తీసుకొని వస్తా అని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. దీనికి ఈటల కూడా కౌంటర్‌ ఇచ్చారు. పదేళ్లలో కేసీఆర్‌కు వచ్చినంత అహంకారాన్ని కేవలం పది నెలల్లోనే రేవంత్‌రెడ్డిలో చూస్తున్నామని ఆయన విమర్శించారు. దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా మూసీ పరివాహక ప్రాంతాల్లోకి వెళ్దామని రేవంత్‌ను ఈటల డిమాండ్‌ చేశారు.

Eha Tv

Eha Tv

Next Story