రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Errabelli Dayakar Rao) పాలకుర్తి నియోజకవర్గం(Palakurthi District) లో విస్తృతంగా పర్యటించారు. దేవరుప్పుల మండలంలో తండా బాట నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా తండాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు.
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Errabelli Dayakar Rao) పాలకుర్తి నియోజకవర్గం(Palakurthi District) లో విస్తృతంగా పర్యటించారు. దేవరుప్పుల మండలంలో తండా బాట నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా తండాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. పార్టీ జెండాలు ఆవిష్కరించారు. గ్రామపంచాయతీ నూతన భవనాలకు శంకుస్థాపన(Foundation ceremony), అలాగే సిసి రోడ్లకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, కొన్ని బీటీ రోడ్లకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు, వివిధ గుడు ల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేస్తూ మంత్రి దేవరుప్పుల మండలంలో తండా బాట నిర్వహించారు. మండలంలోని దుబ్బ తండా, లకావత్ తూర్పు తండా, దేవుని గుట్ట తండా, పొట్టి గుట్ట తండా, లక్ష్మణ్ తండా, సిత్య తండా, పడమటి తండా, లకావత్ తండా లలో మంత్రి విస్తృతంగా పర్యటించారు.
ఈ సందర్భంగా ఆయా తండాల్లో వేర్వేరుగా జరిగిన సభలలో మంత్రి దయాకర్ రావు మాట్లాడారు. తెలంగాణ కు ముందు తండాలు తల్లడిల్లేవి. కనీస వసతులు లేక గిరిజనులు ఇబ్బందులు పడ్డారు. తెలంగాణ తర్వాత, కెసిఆర్ సీఎం అయ్యాక తండాలకు మహర్దశ వచ్చింది. ప్రతి తండాను గ్రామ పంచాయతీ గా మార్చిన ఘనత సీఎం కెసిఆర్ ది. అలా 3,146 తండాలు, గూడాలను గ్రామ పంచాయతీలుగా మార్చారు. గ్రామాలకు దీటుగా గిరిజన తండాల అభివృద్ధి పరచిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిది. ఒక్కో తండాకు రూ.కోటి తో అభివృద్ధి జరిగింది. ఇంకా కోట్లాది రూపాయల సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ప్రతి తండాకు నూతన గ్రామ పంచాయతీ భవనం ఏర్పాటు అవుతున్నది. నిజానికి కాంగ్రెస్ వల్లే తండాలకు కష్టాలు వచ్చాయి. ముందు చూపు లేని కాంగ్రెస్ పాలన ప్రజలకు శాపంగా మారింది. అందుకే కాంగ్రెస్ కు ప్రజలు చరమ గీతం పాడారు. ఇంకా కాంగ్రెస్ వచ్చేది లేదు ఇచ్చేది లేదు. ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచిన ఘనత కేసిఆర్ ది అయితే, అదే ఎస్ టి లలో వర్గీకరణ చిచ్చుకు కాంగ్రెస్ కుట్ర పన్నుతున్నది. తండాలకు వచ్చే ఆ పార్టీ నాయకులను తరిమికొట్టండి అంటూ...రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు.
తెలంగాణకు ముందు రాష్ట్రంలో తండాలు ఎలా ఉండేవి? ఇప్పుడు ఎలా ఉన్నాయో విశ్లేషించుకోవాలి. సాగు నీళ్ళు, తాగు నీళ్ళు, మౌలిక సదుపాయాలు లేక తండాలు సమస్యల్లో మగ్గి పోయాయి. కానీ తెలంగాణ తర్వాత గ్రామాలకు దీటుగా తండాలు అభివృద్ధి చెందాయి అన్నారు. రాష్ట్రంలో అన్నదమ్ముల్లా కలిసి ఉన్న ఎస్ టి లలో వర్గీకరణ చిచ్చుకు కుట్ర పన్నుతున్న కాంగ్రెస్ ను తిప్పి కొట్టండి. తండాలకు వచ్చే ఆ పార్టీ నాయకులను తరిమికొట్టండి. అంటూ తమ పరిపాలనలో ఉన్న రాష్ట్రాల్లో ఇవ్వని హామీలు, తెలంగాణలో కాంగ్రెస్ ఇస్తున్నది. అక్కడ లేనిది ఇక్కడ ఇస్తామంటే నమ్మాలా? ఆ పార్టీ ని నమ్ముకుంటే నట్టేట మునిగినట్లే!. కాంగ్రెస్ వచ్చేది లేదు. ఇచ్చేది లేదు అన్నారు. గిరిజనుల ఏండ్ల గోసను ఎడబాపింది కేసీఆరే. ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచిన ఘనత కేసిఆర్ ది. గ్రామాలకు దీటుగా గిరిజన తండాల అభివృద్ధి చేసిన చరిత బి అర్ ఎస్ ది. 3 గంటల కరెంటు కావాలా? 3 పంటల కరెంటు కావాలా? తేల్చుకోండి అంటూ.... మంత్రి గిరిజనులకు హితవు పలికారు.
ఒక్కో గ్రామానికి కోటి రూపాయలతో అనేక అభివృద్ధి పనులతో సంక్షేమ కార్యక్రమాలతో గతంలో కనీవినీ ఎరగని రీతిలో తండాలను సైతం గ్రామాలకు ధీటుగా అభివృద్ధి పరచిన ఘనత చరిత సీఎం కేసీఆర్ గారికి దక్కుతుందన్నారు. గతంలో ఎప్పుడైనా ఇంత అభివృద్ధి జరిగిందా? ఆలోచించుకోవాలని మంత్రి సూచించారు.
రైతుల నడ్డి విరవడానికి 3 గంటల కరెంటు చాలంటోంది. 24 గంటల కరెంటు కావాలా? 3 గంటల కరెంటు కావాలా? 3 పంటల బిఆర్ ఎస్ కావాలా? ప్రజలు తేల్చుకోవాలి. ప్రజల్ని విభజించి పాలించే కుట్రలు పన్నుతున్న కాంగ్రెస్ నేతలను మన నియోజకవర్గంలో కాలు పెట్టనివ్వవద్దు. తరిమి కొట్టాలన్నారు. మన కోసం పాటుపడుతున్న సీఎం కెసిఆర్ కు, నాకు అండగా నిలవాలి. అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రజలకు పిలుపునిచ్చారు. కష్టాల్లో సుఖాల్లో మీతో నేను ఉన్నాను. ఎప్పుడూ ముఖం తెలియని వాళ్ళు మీ దగ్గరకు వస్తున్నారు. ఈ ఎన్నికలు అయిపోతే వారు వెళ్ళిపోతారని ఆయన అన్నారు.
మా తండాల్లో మా రాజ్యం అన్న గిరిజనుల కోసం 3,146 తండాలు గూడాలను గ్రామపంచాయతీలుగా మార్చి వారి తండాల్లో, గూడాల్లో వారి పాలనను కొనసాగిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. గ్రామాలకు దీటుగా తండాలను తాను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేయడమేగాక, ఒక్కో తండాకు కోటి రూపాయలతో అన్ని విధాలుగా అభివృద్ధి చేసినట్లు వివరించారు. గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి పాటుపడుతున్న సీఎం కేసీఆర్ కి అండగా నిలవాల్సిన అవసరం ఉందని గిరిజనులకు మంత్రి చెప్పారు.
ఈ సందర్భంగా మంత్రికి తండావాసులు ప్రత్యేకించి మహిళలు సంప్రదాయ పద్ధతుల్లో డప్పు చప్పుళ్ళు, నృత్యాలతో బతుకమ్మలతో ఎదురేగి, కుంకుమ తిలకం దిద్ది, ఎడ్ల బండి పై ఊరేగిస్తూ, బైక్ ర్యాలీ నిర్వహిస్తూ, మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి బతుకమ్మలను ఎత్తుకున్నారు. గిరిజనుల కోరిక మేరకు బైకు ర్యాలీ లో పాల్గొన్నారు. ఎడ్ల బండి ఎక్కి తండాల్లో పర్యటించారు.
ఈ తండా బాట, అభివృద్ధి కార్యక్రమాల్లో అడిషనల్ కలెక్టర్ సుహాసిని, ఆయా తండాల ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.