థాయ్‌లాండ్ ఎపిసోడ్ తర్వాత చికోటి ప్రవీణ్ కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మరోసారి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. క్యాసినో కేస్ లో గతంలో చికోటి ప్రవీణ్ ను విచారించిన ఈడీ.. తాజాగా థాయిలాండ్ ఘటన తరువాత మరోసారి నోటీసులు ఇచ్చినట్లు సమాచారం.
థాయ్‌లాండ్(Thailand) ఎపిసోడ్ తర్వాత చికోటి ప్రవీణ్(Chikoti Praveen) కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate) మరోసారి నోటీసులు(Notice) జారీ చేసినట్లు తెలుస్తోంది. క్యాసినో కేస్(Casino Case) లో గతంలో చికోటి ప్రవీణ్ ను విచారించిన ఈడీ(ED).. తాజాగా థాయిలాండ్ ఘటన తరువాత మరోసారి నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. చికోటితో పాటు చిట్టి దేవేందర్(Chitti Devender), సంపత్(Sampath), మాధవ రెడ్డి(Madhava Reddy) లకు కూడా ఈడీ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. శుక్రవారం వీరు ఈడీ విచారణ(Enquiry)కు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇటీవల చికోటి ప్రవీణ్ థాయ్‌లాండ్‌లో అరెస్టు(Arrest) అయ్యాడు. అక్కడ గ్యాంబ్లింగ్(Gambling) నిర్వహిస్తుండగా.. థాయ్ పోలీసులు(Police) దాడులు నిర్వహించడంతో చికోటి ప్రవీణ్ చిక్కాడు. చికోటి ప్రవీణ్‌తో పాటు పోలీసులు మరో 93 మందిని అరెస్టు చేశారు. వారిలో 83 మంది భారతీయులు పట్టుబడ్డారు. పట్టుబడిన వారిలో 16 మంది మహిళలు కూడా ఉన్నారు. దాడుల సమయంలో పారిపోయేందుకు చికోటి ప్రయత్నించగా.. అతన్ని పోలీసులు పట్టుకున్నారని వార్తలు వెలువడ్డాయి.