అగ్రిగోల్డ్(Agrigold) కుంభకోణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్(Enforcement Directrate) ఛార్జిషీట్(charge Sheet) దాఖలు చేసింది. అగ్రిగోల్డ్ ప్రమోటర్లు ఏవీ రామారావు(AV Rama Rao), శేషునారాయణరావు(Seshu Narayana Rao), హేమసుందర వరప్రసాద్ ల పేర్లను ఈడీ ఛార్జిషీట్ లో చేర్చింది.

ED Charge Sheet
అగ్రిగోల్డ్(Agrigold) కుంభకోణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్(Enforcement Directrate) ఛార్జిషీట్(charge Sheet) దాఖలు చేసింది. అగ్రిగోల్డ్ ప్రమోటర్లు ఏవీ రామారావు(AV Rama Rao), శేషునారాయణరావు(Seshu Narayana Rao), హేమసుందర వరప్రసాద్ ల పేర్లను ఈడీ ఛార్జిషీట్ లో చేర్చింది. అగ్రిగోల్డ్ ఫామ్ ఎస్టేట్స్ సహా 11 అనుబంధ కంపెనీల పేర్లను సైతం ఛార్జిషీట్ లో ఈడీ ప్రస్తావించింది. ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను నాంపల్లి ఎంఎస్‌జే కోర్టు విచారణకు స్వీకరించింది. అక్టోబరు 3న అగ్రిగోల్డ్ ప్రమోటర్లు, కంపెనీల సంబంధికులు కోర్టుకు హాజరుకావాలని నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. 32 లక్షల మంది డిపాజిటర్లను రూ.6,380 కోట్ల మోసం చేసినట్లు అగ్రిగోల్డ్ పై అభియోగాలు ఉన్నాయి. అగ్రిగోల్డ్ కేసులో రూ.4,141 కోట్ల ఆస్తులను ఈడీ గతంలో అటాట్ చేసింది.
