డెక్కన్ క్రానికల్ ప్రమోటర్లకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ షాక్ ఇచ్చింది. మనీ లాండరింగ్ కేసులో విచారణకు ఏమాత్రం సహకరించకపోవడంతో డెక్కన్ క్రానికల్ ప్రమోటర్లను ఈడీ అరెస్ట్ చేసింది. ఈ కేసులో వెంకట్రామ్ రెడ్డి సహా మరో ఇద్దరిని ఈడీ అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
డెక్కన్ క్రానికల్ ప్రమోటర్లకు(Deccan Chronicle Promoters) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate) షాక్ ఇచ్చింది. మనీ లాండరింగ్ కేసు(Money Laundering)లో విచారణకు ఏమాత్రం సహకరించకపోవడంతో డెక్కన్ క్రానికల్ ప్రమోటర్లను ఈడీ(ED) అరెస్ట్(Arrest) చేసింది. ఈ కేసులో వెంకట్రామ్ రెడ్డి(Venkatttram Reddy) సహా మరో ఇద్దరిని ఈడీ అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. కెనరా బ్యాంకు(Canara Bank), ఐడీబీఏ బ్యాం(IDBA Bank) లను మోసం చేసిన కేసులో డెక్కన్ క్రానికల్ ప్రమోటర్లను ఈడీ అరెస్ట్ చేసింది. రూ.8వేల కోట్ల బ్యాంక్ ఫ్రాడ్(Bank Fraud) కేసులో ఈడీ అభియోగాలు మోపింది. హైదరాబాద్(Hyderabad), ఢిల్లీ(Delhi), బెంగళూరు(Bengaluru)లో డెక్కన్ క్రానికల్‌కు చెందిన 363 కోట్ల రూపాయల విలువ చేసే 14 ఆస్తుల్ని అటాచ్(Attach) చేసింది. ఇక డెక్కన్ క్రానికల్ స్కామ్(Deccan Chronicle Scam)లో ఈడీ ఆరు ఎఫ్ఐఆర్(FIR) లు నమోదు చేసింది.