అధికారపార్టీకి ఎన్నికల సంఘం(Election Commission) పెద్ద షాకే ఇచ్చింది. రైతుబంధు(Rythu Bandhu) నిధులను నిలిపివేయాలని ఆదేశించింది. గత వారం రైతుబంధుకు అనుమతించిన ఈసీ ఇప్పుడు హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడంతో బీఆర్‌ఎస్‌(BRS) నేతలు కంగుతిన్నారు.

అధికారపార్టీకి ఎన్నికల సంఘం(Election Commission) పెద్ద షాకే ఇచ్చింది. రైతుబంధు(Rythu Bandhu) నిధులను నిలిపివేయాలని ఆదేశించింది. గత వారం రైతుబంధుకు అనుమతించిన ఈసీ ఇప్పుడు హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడంతో బీఆర్‌ఎస్‌(BRS) నేతలు కంగుతిన్నారు. రైతుబంధుపై అనేక ఫిర్యాదులు రావడంతో ఈసీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. యాసంగి సీజన్‌కు సంబంధించి రైతుబంధు పంపిణీకి ఈ నెల 24వ తేదీన ఈసీ అనుమతి ఇచ్చింది. ఈ నెల 28వ తేదీలోపు పంట సాయాన్ని అందించాలని తెలిపింది. ఇప్పుడు అనుమతులను ఉపసంహరించుకుంటూ ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది.

Updated On 27 Nov 2023 12:59 AM GMT
Ehatv

Ehatv

Next Story