TS Election 2023 Notification : తెలంగాణ అసెంబ్లీ నోటిఫికేషన్ విడుదల
తెలంగాణలో ఎన్నికలపై(Telangana Assembly Elections) ఈసీ నోటిఫికేషన్(Election Commission Notice) రానే వచ్చింది. ఈరోజు నుంచి ఈనెల 10 వరకు నామినేషన్లకు గడువు విధించింది. నామినేషన్లు(Nominations) దాఖలు చేసుకునేందుకు అభ్యర్థులు ముహూర్తాలు చూసుకుంటున్నారు. పలువురు అభ్యర్థులు ఇప్పటికే పంతుళ్లను సంప్రదించారు.
తెలంగాణలో ఎన్నికలపై(Telangana Assembly Elections) ఈసీ నోటిఫికేషన్(Election Commission Notice) రానే వచ్చింది. ఈరోజు నుంచి ఈనెల 10 వరకు నామినేషన్లకు గడువు విధించింది. నామినేషన్లు(Nominations) దాఖలు చేసుకునేందుకు అభ్యర్థులు ముహూర్తాలు చూసుకుంటున్నారు. పలువురు అభ్యర్థులు ఇప్పటికే పంతుళ్లను సంప్రదించారు. నామినేషన్ల దాఖలుకు ముహూర్తం చూసి పెట్టాలని వారు కోరుతున్నారు. ముహూర్తం లేకుండా ఏ పని చేయని సీఎం కేసీఆర్(KCR) ఇప్పటికే ఈ విషయంలో ముందున్నారు. నవంబర్ 9న సిద్దిపేట జిల్లాలోని కోనాయిపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేయనున్నారు. అక్కడి నుంచి గజ్వేల్(Gajwel) మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ సమర్పిస్తారు. అనంతరం కామారెడ్డిలో(Kamareddy) నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆ తర్వాత కామారెడ్డిలో సీఎం కేసీఆర్ బహిరంగ సభలో(Public meeting) పాల్గొంటారు.
ఈనెల 13 వరకు నామినేషన్లను ఎన్నికల కమిషన్(Election commission) పరిశీలించనుంది. ఉపసంహరణ, స్క్రూటినీ అనంతరం ఈసీ తుది జాబితా ప్రకటించనుంది. నామినేషన్ దాఖలు సమయం నుంచి అభ్యర్థుల వ్యయాన్ని ఈసీ లెక్కించనుంది. మరోవైపు రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం ముమ్మర చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఉన్నతాధికారులకు పలు ఆదేశాలు జారీ చేసింది. ఈసీ ఆదేశాల మేర అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రజలకు ఈసీ భరోసా కల్పిస్తూ.. ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మొత్తం 119 నియోజకవర్గాల్లో 3.17 కోట్ల మంది ఓటర్లుండగా ఒక్కో పోలింగ్ కేంద్రంలో సగటున 870 మంది ఓటు హక్కును వినియోగించుకునేలా 35,356 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
ఇప్పటికే ఎగ్జిట్‌పోల్స్‌పై ఎన్నికల సంఘం నిషేధించింది. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్(Election Code) ఉండడంతో నవంబర్ 7 నుంచి నవంబర్ 30 సాయంత్ర 6.30 వరకు ఎగ్జిట్ పోల్స్‌పై కేంద్రం నిషేధం విధించింది. నిబంధనలు ఉల్లంఘించినవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని, రెండేళ్ల జైలు లేదా జరిమానా విధించే అవకాశం ఉందని ఎన్నికల కమిషన్ తెలిపింది.
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కమిషన్ ముమ్మర తనిఖీలు చేపట్టింది. పోలీసుల విస్తృత తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడుతోంది. ఇప్పటికే పట్టుబడ్డ నగదు మొత్తం రూ.400 కోట్లు దాటింది. అక్టోబర్ 9 నుంచి ఇప్పటివవరకు అన్ని రకాల స్వాధీనాల విలువ రూ.412 కోట్లకుపైగా ఉన్నట్లు ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు పెట్టి పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. లెక్క చూపని నగదును స్వాధీనం చేసుకుంటున్నారు. ఎన్నికల వేళ ప్రలోభాలకు అడ్డుకట్ట వేయాలని, ఘర్షణలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఈసీ ఆదేశించింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. 65 వేల మంది యూనిఫాం సిబ్బందిని ఈసీ వినియోగించుకోనుంది. ఇప్పటికే 100 కంపెనీల బలగాలు రాష్ట్రానికి వచ్చాయి. 2018లో 300 కంపెనీల కేంద్ర బలగాలను ఎన్నికల కమిషన్ పంపించింది. ఇక్కడి పరిస్థితులను అంచనా వేస్తూ కేంద్ర బలగాలను రాష్ట్రానికి పంపిస్తోంది.