తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల(Telangana Assembly Elections)కు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయా? లేక కేసీఆర్(KCR) ముందస్తుకు వెళతారా? అదీ కాకపోతే 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల పాటుతో జరుగుతాయా? ఈ సందేహాలు రాజకీయ విశ్లేషకులను వెంటాడుతున్నాయి. కేసీఆర్ మదిలో ఏముందో చెప్పడం ఎంత కష్టమో, ప్రధాని మోదీ ఆలోచన ఎలా ఉందో పసికట్టడం అదే సంక్లిష్టం. ఇప్పుడు వినిపిస్తున్న వార్త ఏమిటంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల(Telangana Assembly Elections)కు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయా? లేక కేసీఆర్(KCR) ముందస్తుకు వెళతారా? అదీ కాకపోతే 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల పాటుతో జరుగుతాయా? ఈ సందేహాలు రాజకీయ విశ్లేషకులను వెంటాడుతున్నాయి. కేసీఆర్ మదిలో ఏముందో చెప్పడం ఎంత కష్టమో, ప్రధాని మోదీ ఆలోచన ఎలా ఉందో పసికట్టడం అదే సంక్లిష్టం. ఇప్పుడు వినిపిస్తున్న వార్త ఏమిటంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికలతో పాటు నిర్వహించాలన్న ఆలోచనలో ఎన్నికల సంఘం ఉందట! ఈ ప్రతిపాదనను కొట్టిపారేయడానికి లేదంటున్నారు ఎన్నికల సంఘం అధికారులు. ప్రస్తుతం భారత ఎన్నికల కమిషన్ దగ్గర రెండు మార్గాలున్నాయి. ఒకటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను లోక్‌సభ ఎన్నికలతో పాటుగా నిర్వహించడం. రెండోది మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా నిర్వహించడం. తెలంగాణ రాష్ట్రంలో రెండో అసెంబ్లీ 2019, జనవరి 16న ఉనికిలోకి వచ్చింది. 2018 డిసెంబర్‌లోనే ఎన్నికల ఫలితాలు వచ్చాయి. డిసెంబర్ 13న కేసీఆర్ వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అంటే తెలంగాణ అసెంబ్లీ గడువు 2024 జనవరి 16 వరకు ఉంది. మరోవైపు లోక్‌సభ ఎన్నికలు 2024 మే మాసంలో జరగాల్సి ఉంది.
సాధారణ ఎన్నికలకు నోటిఫికేషన్ మార్చ్ 2024లో విడుదల చేయాల్సి ఉంటుంది. జనవరి- మార్చి మాసాల మధ్య పెద్దగా అంతరం లేదు కాబట్టి రెండు ఎన్నికలను ఒకేసారి కలిపి నిర్వహించాలనే ఆలోచనను ఎన్నికల సంఘం చేస్తున్నదట. తెలంగాణ ఎన్నికలను, లోక్‌సభ ఎన్నికలను ఒకేసారి నిర్వహించడం వల్ల ఎంత కాదనుకున్నా 700 కోట్ల రూపాయల వ్యయం మిగులుతుందని ఎన్నికల సంఘం లెక్కలేసుకుని మరీ చెబుతోంది. ఎన్నికల సంఘానికి పని భారం తగ్గుతుంది. వేర్వేరుగా ఎన్నికలను జరపడం ఎన్నికల సంఘానికి ఒకింత కష్టమే! ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణ పనిలో పడింది. వివిధ జిల్లాల ఎన్నికల అధికారులతో సమావేశం అవుతోంది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలను వేర్వేరుగా నిర్వహించాలా? లేక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గడ్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో కలిపి జరపాలా? అన్నదానిపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవడానికి ముగ్గురు సభ్యుల ఈసీ బృందం ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో తెలంగాణకు రానుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ చెప్పారు. మొత్తంమీద తెలంగాణ ఎన్నికలను లోక్‌సభ ఎన్నికలతో పాటుగా నిర్వహించే ఆలోచనలో ఉందని అర్థమవుతోంది..