కేంద్ర ఎన్నికల(Election Commission) సంఘం ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్(Election Schedule) ను ప్రకటించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్(Rajiv Kumar) మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికలకు చాలా ప్రాధాన్యత ఉండటం గమనార్హం. ఎన్నికలకు ముందు మేము అన్ని వర్గాలతో విస్తృత సమావేశాలు నిర్వహించామని తెలిపారు.

Breaking News
కేంద్ర ఎన్నికల(Election Commission) సంఘం ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్(Election Schedule) ను ప్రకటించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్(Rajiv Kumar) మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికలకు చాలా ప్రాధాన్యత ఉండటం గమనార్హం. ఎన్నికలకు ముందు మేము అన్ని వర్గాలతో విస్తృత సమావేశాలు నిర్వహించామని తెలిపారు. 40 రోజులు 5 రాష్ట్రాలలో పరిస్థితులను పరిశీలించామని పేర్కొన్నారు. ఐదు రాష్ట్రాల్లో(5 States) 679 అసెంబ్లీ స్థానాలుండగా.. 16.14 కోట్ల ఓటర్లు ఉన్నారని వెల్లడించారు. ఐదు రాష్ట్రాల్లో 60 లక్షల మంది కొత్త ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు.
తెలంగాణలో 3.17 కోట్లు ఛత్తీస్ గడ్‌లో 2.03 కోట్లు, మిజోరంలో 8.52 లక్షల మంది, మధ్యప్రదేశ్‌లో 5.6 కోట్లు, రాజస్థాన్‌లో 5.25 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు వివరించారు. ఐదు రాష్ట్రాల్లో లక్షా 77 వేల పోలింగ్ కేంద్రాలున్నాయని వివరించారు. తెలంగాణలో(Telangana) ప్రతీ 897 మందికి ఒక పోలింగ్ కేంద్రం ఉందని.. మొత్తం 35, 356 పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు వెల్లడించారు. నేటి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని.. తెలంగాణలో 148 చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు జరుగనున్నాయని.. డిసెంబర్ 3న ఫలితాలు ఉంటాయని వెల్లడించారు.
మధ్యప్రదేశ్‌లో(Madhya Pradesh) నవంబర్ 17న, రాజస్థాన్‌లో నవంబర్ 23న, ఛత్తీస్‌గడ్‌లో నవంబర్ 7(1వ దశ), నవంబర్ 17న((2వ దశ), మిజోరంలో నవంబర్ 7న ఎన్నికలు జరుగనున్నాయి.
